ఎక్కడి తమ్ముళ్లు అక్కడే. ప్రాంతాల వారీగా ఫైట్. సమస్యలపై ఎక్కడికక్కడే పోరాటం. ఏపీ టీడీపీలో ప్రస్తుతం ఇదే చర్చ.. ఇదే వ్యూహం. పార్టీలో కేంద్రీకృతంగా సాగే ఉద్యమాలు.. ఇప్పుడు డీసెంట్రలైజ్డ్ అయ్యాయి. ఎందుకీ ఎత్తుగడ? టీడీపీకి వర్కవుట్ అవుతుందా? టీడీపీ కొత్తగా ‘లోకల్’ వ్యూహం..! ఏపీ టీడీపీ కొత్త లైన్ తీసుకుంది. ప్రభుత్వంపై పోరాటం విషయంలో వ్యూహం మార్చింది. పార్టీ కేంద్ర కార్యాలయంలో కూర్చుని సీఎం జగన్ను తిట్టిపోస్తే లాభం లేదని గ్రహించినట్టు ఉంది. ప్రజా సమస్యలతోపాటు..…
టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేనికి జింతాత జిత జిత అవుతోందా? కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవా? కేసులపై కేసులు వచ్చి పడుతున్నాయా? ఒకప్పుడు పోలీసులు.. కేసులంటే భయపడని ఈ మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ఖాకీలను చూస్తే వంగి వంగి దండాలు పెడుతున్నారా? ఇంతకీ చింతమనేనిలో మార్పు వచ్చిందా లేక రాజకీయ మార్పులకు అనుగుణంగా ఆయనే ట్యూన్ అయ్యారా? చింతమనేనికి జింతాత జిత జిత అవుతోందా? రెండున్నరేళ్లు వెనక్కి వెళ్లితే.. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీరు…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. రాజకీయ వ్యూహాత్మక మౌనాన్ని కొనసాగిస్తున్నారా? పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లే క్రమంలో.. ఆయన సరికొత్త ఆలోచనలు చేస్తున్నారా? సరికొత్త గేమ్ ప్లాన్ తో బరిలోకి దిగబోతున్నారా? ఈ ప్రశ్నలకు.. ఆయన వ్యవహారశైలి అవుననే సమాధానం చెబుతోంది. సందర్భానుసారం మాట్లాడ్డం.. ముఖ్యమైన విషయాలపై ట్వీట్లు చేయడం తప్ప.. పెద్దగా హడావుడి చేయకుండా.. ఆయన ఎదురుచూస్తున్న తీరు సైతం.. సరికొత్త వ్యూహాలకు ఆయన పదును పెడుతున్నారన్న అభిప్రాయాన్ని కలిగిస్తోంది. తాజా పరిణామాలను విశ్లేషిస్తే.. చంద్రబాబు…
కలకలం సృష్టించిన టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వ్యవహారం టీ కప్పులో తుఫాన్లా ముగిసింది… అసంతృప్తితో పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని బుచ్చయ్య చౌదరి గత నెలలో సన్నిహితుల వద్ద ప్రస్తావించారు. దీంతో బుచ్చయ్య చౌదరితో తెలుగుదేశం నాయకత్వం సంప్రదింపులు జరిపింది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాతో భేటీ అయ్యారు బుచ్చయ్య చౌదరి.. దీంతో.. బుచ్చయ్య చౌదరి రాజీనామా వ్యవహారానికి పులిస్టాప్ పడిపోయింది.. ఇవాళ రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన బుచ్చయ్య చౌదరి.. వైసీపీ…
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈరోజు కడప జిల్లా నేతలతో సమావేశం అయ్యారు. పార్టీకి సంబందించిన పలు అంశాలపై చర్చించారు. జమ్మలమడుగు నియోజక వర్గం టీడీపి ఇన్చార్జీగా మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కుమారుడు భూపేష్ రెడ్డిని నియమించాలని ఈ చర్చలో నిర్ణయం తీసుకున్నారు. త్వరలోనే దీనిపై ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది. అదే విధంగా బద్వేల్ ఉప ఎన్నికపై కూడా భేటీలో చర్చించారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ను…
ఒకప్పుడు ఆ నియోజకవర్గం ఆ పార్టీకి కంచుకోట. ఇప్పుడు అక్కడ అదేపార్టీ దిక్కులేకుండా పోయింది. మారిన రాజకీయ పరిణామాలు.. నేతల అవసరాలు మళ్లీ ఆ పార్టీకి గిరాకీ తెచ్చాయి. ఇప్పటికే ఓ నేత పాతగూటికి చేరేందుకు దారులు వెతుకుతుంటే.. మరో కొత్త నేత తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ పార్టీని భుజానికి ఎత్తుకొనేందుకు రెడీ అవుతున్నారట. దేవగుడి ఫ్యామిలీ టీడీపీ వైపు చూస్తోందా? కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాలు ఆసక్తిగా మారుతున్నాయి. నాయకుడే లేకుండా దిక్కులేనిదైన…
కుప్పం టార్గెట్గా అధికారపార్టీ వేగంగా పావుల్ని కదుపుతోంది. మేము ఏమైనా తక్కువా అన్నట్టు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోందట టీడీపీ. కుప్పం మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మేము పుంగనూరు సంగతి చూస్తాం అంటున్నారట అక్కడి తెలుగు తమ్ముళ్లు. నిస్తేజంగా ఉన్న పాత ఇంఛార్జ్ను పక్కన పెట్టి కొత్తవారికి అవకాశం ఇచ్చి పెద్దిరెడ్డి పెద్దరికానికి చెక్ పెట్టాలని చూస్తున్నారట. పుంగనూరుపై టీడీపీ ఫోకస్ పెట్టిందా? చిత్తూరు జిల్లా ఏపీ రాజకీయాల్లో ప్రత్యేకమైంది. మాజీ సీఎం చంద్రబాబు సొంత…
ఆంధ్రా అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు.. దూకుడుగా మాట్లాడుతుంటారు. అది పార్టీ వ్యూహమైనా సరే.. వ్యక్తిగత ఆవేశమైనా సరే.. తమ పార్టీని ఎవరైనా విమర్శిస్తే వాళ్లు చూస్తూ ఊరుకోరు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా.. ఆ పార్టీ నాయకులు అలాగే ప్రవర్తించారు కూడా. ఇందులో ముఖ్యంగా.. కొడాలినాని, అనిల్ కుమార్ యాదవ్, రోజా వంటి నేతలు.. ఈ దూకుడును ముందుకు తీసుకుపోయారు. ఈ లిస్ట్ లో.. తాజాగా.. అత్యంత నెమ్మదస్తురాలిగా మాట్లాడే… లక్ష్మీపార్వతి సైతం చేరిపోయారు. ఎన్టీఆర్…
అప్పన్న దేవాలయానికి సంబంధించిన భూముల అవకతవకల్లో ధర్మకర్తగా ఉన్న అశోక్ గజపతి రాజు పాత్ర ఉందేమో అన్న అనుమానం కలుగుతోందని…అసలు ఆయన ధర్మకర్త..లేక అధర్మ కర్తా అని ఫైర్ అయ్యారు విజయ సాయి రెడ్డి. సింహాచలం సింహాద్రి అప్పన్నను దర్శించుకున్నారు రాజ్య సభ సభ్యులు విజయ సాయిరెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఆయన భూములు, దేవాలయంలో ఆస్థులలో అవకతవకలకు పాల్పడకపోతే కోర్టు కు వెళ్లి మళ్ళీ పదవి తెచ్చుకోవడం చూస్తుంటే అదే అనుమానం కలుగుతోందని ఎద్దేవా…
రాజకీయాలు ఎన్నికల్లో చేసుకుందాం.. ముందైతే అభివృద్ధి చేద్దాం అని పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం… శ్రీకాకుళం జిల్లా అక్కివరం గ్రామంలో రైతు భరోసా కేంద్రానికి శంకుస్థాపన చేసిన స్పీకర్ తమ్మినేని.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.. మేం శంకుస్థాపనలు చేస్తుంటే కోర్టులకు వెళ్లి స్టేలు తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామాలు అభివృద్ధి చేస్తుంటే ఇలా చేయడం సరికాదని హితవుపలికిన తమ్మినేని సీతారం..…