ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో సత్తా చాటింది వైసీపీ.. ఇప్పటికే మండల అధ్యక్షులు, ఉపాధ్యక్షుల ఎన్నిక పూర్తి కాగా.. నేడు జడ్పీ ఛైర్మన్లు, డిప్యూటీ ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఇవాళ ఉదయం పది గంటల లోపు ఇద్దరు కో ఆప్షన్ సభ్యుల ఎన్నిక కు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది.. ఉదయం పది నుంచి ఒంటి గంట లోపు స్క్రూటినీ, నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ, ఎన్నిక ఉండనుండగా.. మధ్యాహ్నం ఒంటి గంటకు కోఆప్షన్ సభ్యుల ప్రమాణస్వీకారం.. మధ్యాహ్నం 3 గంటలకు…
విజయవాడ టీడీపీలో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చెయ్యనని… ఎంపీ నాని అధిష్ఠానానికి చెప్పినట్లు తెలుస్తోంది. దీనిపై నాని అధికారికంగా ఎక్కడా ప్రకటన చేయలేదు. టీడీపీ అధిష్టానం కూడా దీనిపై వ్యాఖ్యానించలేదు. అయితే పార్టీలోని అంతర్గత గొడవలతోనే నాని.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. విజయవాడ కార్పొరేషన్ ఎన్నికల సమయంలోనే…పార్టీ నేతల మధ్య విభేదాలు బయటపడ్డాయి. మేయర్ సీటు విషయంలో కేశినేని నానితో కొందరు నేతలు విభేదించారు. ఈ సందర్భంగా నాని చేసిన…
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పరిషత్ ఎన్నికల ఫలితాలు కీలక పరిణామాలకు తెరలేపాయి.. ఇప్పటి వరకు దూరంగా ఉన్న టీడీపీ-జనసేన కలిసి ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 స్థానాలు, వైసీపీ 6 స్థానాలు, జనసేన 4 స్థానాల్లో విజయం సాధించగా.. టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలన్నా.. జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను…
ఏపీకి చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ దివాకర్‌రెడ్డి తెలంగాణ అసెంబ్లీలో హల్ చల్ చేశారు.. సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌ను కూడా ఆయన కలిసినట్టుగా తెలుస్తోంది.. ఇక, ఇదే సమయంలో.. సీఎల్పీ కార్యాలయానికి సైతం వెళ్లిన ఆయన.. పాత మిత్రులను పలకరించారు.. అయితే, ఈ సమయంలో.. జేసీ దివాకర్‌రెడ్డిపై సీరియస్ అయ్యారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి.. తమ సీఎల్పీకి వచ్చి పార్టీని డ్యామేజ్ చేయొద్దని సూచించారు. కాంగ్రెస్ పార్టీకి జేసీ దివాకర్‌రెడ్డి హితోక్తులు అవసరం…
గెలుపోటములు దైవాదీనం. ఎవరినీ ఎప్పుడు ఎలా అదృష్టం వరిస్తుందో ముందుగానే చెప్పడం కష్టం. రాజకీయాల్లోనూ ఇలాంటి సంఘటనలే పునరావృతం అవుతూ ఉంటాయి. ఇక్కడ ప్రత్యర్థుల ఎత్తులను ముందుగానే తెలుసుకొని చిత్తు చేయాల్సి ఉంటుంది. అలాగే జనాల్లో ఫేస్ వాల్యూను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి పార్టీ అధినేత చరిష్మా కూడా తోడైతే ఇక అభ్యర్థి గెలుపు నల్లేరు మీద నడకే అవుతుంది. కేవలం అధినేత ఫొటోతోనే గెలుపు సాధ్యమా? అంటే ఇందులో కొంత వాస్తవం ఉందనే చెప్పొచ్చు.…
ఏపీలో ప్రతిపక్ష రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. వద్దనుకుని వదిలేసుకున్న పార్టీలు స్థానిక సంస్థల ఎన్నికల్లో చేతులు కలుపుతున్నాయి. చెట్టపట్టాలేసుకు తిరుగుతున్నాయి. అవసరాలకు తగ్గట్టు పావులు కదుపుతున్నాయి. పక్క పార్టీ పొడే గిట్టని వాళ్లు ఈ పొత్తులకు ఎలా ఒప్పుకున్నారో…. బీజేపీని వదిలి టీడీపీ వెంట జనసేన పరుగులు? 2019 ఎన్నికలకు ముందు ఏపీలో.. టీడీపీ బీజేపీని వదిలేసింది.. జనసేన టీడీపీని వద్దనుకుంది. ఎన్నికల తర్వాత బీజేపీ-జనసేన పొత్తుపెట్టుకున్నాయి. ఇప్పటికీ అదేపొత్తు కొనసాగుతోంది. రాష్ట్రస్థాయిలో ఏదైనా విషయం వస్తే…
ఆచంట ఎంపీపీ పదవిని టీడీపీ కైవసం చేసుకున్నది. మొత్తం 17 ఎంపీటీసీలు ఉన్న ఆచంటలో టీడీపీ 7 చోట్ల, వైసీపీ 6 చోట్ల, జనసేన 4 చోట్ల విజయం సాధించింది. దీంతో, టీడీపీ, వైసీపీలు ఇద్దరిలో ఎవరు ఎంపీపీ కావాలి అన్నా జనసేన మద్ధతు అవసరంగా మారింది. క్యాంపు రాజకీయాలు షురూ కావడంతో టీడీపీ, జనసేన పార్టీలు తమ ఎంపీటీసీలను రహస్యప్రాంతాలకు తరలించారు. కాగా, ఈ ఎంపీపీ పదవి కోసం టీడీపీ, జనసేన పార్టీలు పొత్తును కుదుర్చుకున్నాయి.…
ఆ జిల్లాలో వారి బాధను టీడీపీ నేతలు ఎవరూ పట్టించుకోవడం లేదట. వరస ఓటములతో ఆత్మవిశ్వాసం దెబ్బతింటోందని గగ్గోలు పెడుతున్నా వినేవాళ్లే లేరట. ఇక లాభం లేదని అనుకున్నారో ఏమో.. మీకు ఇదే లాస్ట్ ఛాన్స్ అని నేతలకు వార్నింగ్ ఇస్తున్నారట. ఆ కథేంటో ఇప్పుడు చూద్దాం. చంద్రబాబును మించిన ఆవేదనలో టీడీపీ తమ్ముళ్లు..! 2019 అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో టీడీపీ నుంచి ఒక్క చంద్రబాబే గెలిచారు. మిగిలినచోట్ల వైసీపీదే విజయం. అది మొదలు.. పంచాయతీ,…
ఏపీలో టీడీపీకి విచిత్ర పరిస్థితులు ఎదురవుతున్నాయా? గవర్నర్ అపాయింట్మెంట్ పొందడంలోనూ ఆ పార్టీ విఫలం అవుతోందా? లోపం ఎక్కడుంది? టీడీపీలో జరుగుతున్న చర్చ ఏంటి? ప్రణాళికలో లోపమా? మరేదైనా కారణమా? రాజకీయ పార్టీలు గవర్నర్‌తో భేటీ కావడం సాధారణం. ప్రభుత్వాలపై ఫిర్యాదు చేసేందుకు.. వివిధ విషయాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లేందుకు రాజ్‌భవన్‌కు వెళ్తుంటారు నాయకులు. గవర్నర్ వ్యవస్థపై టీడీపీకి మొదటినుంచి తీవ్ర అసంతృప్తి ఉన్నా.. ఆయా సందర్భాలలో రాజ్‌భవన్‌కు వెళ్లిన ఉదంతాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతిపక్షంలో…