అయ్యన్న పాత్రుడుది టెర్రరిస్ట్ మనస్తత్వం అని ఏపీ డెప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. జగన్ వైఎస్ కుమారుడే కానీ వారసుడు కాదు.పేదల హృదయాలను గెలుచుకున్న వాడు సీఎం జగన్ అని చెప్పారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. అయ్యన్న మాటలతో సమాజమే సిగ్గుతో తలదించుకుంది. బీసీ నాయకుడైన అయ్యన్న ఎస్సీ మహిళైన హోం మంత్రిని కించ పరిచారు. అయ్యన్నపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసు నమోదు చేయాలి అన్న ఆయన కోడెల చావుకు చంద్రబాబే కారణం అని తెలిపారు.
ఇక అయ్యన్నని దళితులు క్షమించరు.. ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలి. ఎస్సీ, బీసీల మధ్య ఘర్షణ పెట్టేలా అయ్యన్న వ్యవహరిస్తున్నారు. తమిళనాడులో జయలలిత స్థానిక ఎన్నికలను బాయ్ కాట్ చేసినప్పుడు పోటీనే చేయలేదు. ఏపీలో స్థానిక ఎన్నికల్లో పోటీ చేశారు.. ప్రచారం చేశారు.. మళ్లీ బాయ్ కాట్ చేశామంటున్నారు. అందరూ రాజీనామా చేయడం కంటే కుప్పంలో చంద్రబాబు రాజీనామా చేయాలి. కుప్పంలో చంద్రబాబుపై ఓ సామాన్య మహిళా కార్యకర్తను నిలబెట్టి గెలుస్తాం. కానీ ఓటు హక్కును ఖూనీ చేసిన వ్యక్తి చంద్రబాబు అని పేర్కొన్నారు.