అమరావతి : సీఎం జగన్ రెండున్నరేళ్ల పాలనపై సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. రెండున్నరేళ్ల పాలనలో సీఎం జగన్ దళితులను అన్ని విధాల వంచించారని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దుచేసి రూ.26,663 కోట్ల సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించారని నిప్పులు చెరిగారు వర్ల రామయ్య. దారి మళ్లిన సబ్ ప్లాన్ నిధులను తిరిగి ఎస్సీ,…
నారా భువనేశ్వరిపై చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి. ఈ ఘటనపై నందమూరి కుటుంబ సభ్యులు సైతం భువనేశ్వరికి అండగా నిలబడ్డారు. అయితే తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానెల్ నిర్వహించిన డిబేట్లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో నారా లోకేష్, ఆయన బృందం నాతో నా కుటుంబంపై చేసిన కామెంట్లకు ఎమోషన్లగా ఒక మాట అనబోయి మరో మాట అన్నానన్నారు. అయితే ఈ విషయంలో తాను…
ఇటీవల ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట మున్సిపాల్టీల ఫలితాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎన్నికల్లో పోటీ చేసినా, పని చేసిన కార్యకర్తలు, నేతలకు చంద్రబాబు అభినందనలు తెలిపారు. కొండపల్లి ఎన్నికల్లో ఎంపి కేశినేని పాత్రపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. నేతలను, కార్యకర్తలను ఎంపి నాని బాగా కో-ఆర్డినేట్ చేశారన్న బాబు… సమర్థులైన వారికి కొన్ని చోట్ల అవకాశం ఇవ్వకపోవడం వల్ల నష్టం జరిగిందన్నారు. జగ్గయ్యపేటలో టీడీపీ సాంకేతికంగా ఓడినా.. నైతికంగా గెలిచిందన్నారు చంద్రబాబు. అయితే ఇకపై నియోజకవర్గ…
ఆయన టీడీపీలో సీనియర్. అలాంటి నాయకుడి కుటుంబ రాజకీయ భవిష్యత్.. గందరగోళంలో పడిందా? ఆరుసార్లు గెలిచిన నాయకుడు.. ఒక్క ఓటమితో పక్కకెళ్లిపోయారు. ఆయన స్థానంలో బరిలో దిగిన తమ్ముడికీ వరస ఓటములే. దీంతో ఆ కుటుంబం పక్క నియోజకవర్గంపై కన్నేసినట్టు జోరుగా చర్చ జరుగుతోంది. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథా? తుని సురక్షితం కాదని యనమల కుటుంబం భావిస్తోందా? టీడీపీలో కీలకంగా వ్యవహరించే మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.. ఎన్నికల్లో పోటీ చేసి దశాబ్దంన్నరపైనే అయింది.…
ఏపీ సీఎం వైఎస్ జగన్కు మరోసారి లేఖ రాశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఈసారి గ్రామపంచాయతీల నుంచి మళ్లించిన నిధులు రూ.1,309 కోట్లు తక్షణమే పంచాయతీ ఖాతాలలో జమ చేయాలని లేఖలో పేర్కొన్నారు. జగన్ సీఎం అయినప్పటి నుంచి అప్పులు తేవడం, ఆస్తులు అమ్మేయడం, కనిపించిన చోటునల్లా తాకట్టు పెట్టడం ఈ మూడు మార్గాల ద్వారానే పాలన సాగిస్తున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం 14, 15వ ఆర్థిక సంఘాల ద్వారా కేటాయించిన…
కుప్పంలో ప్రస్తుతం ఎన్నికలు లేవు. రాజకీయ సభలు.. సమావేశాలు లేవు. కానీ.. జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల తీరు మరోసారి అక్కడ చర్చగా మారింది. నేరుగా టీడీపీ నేతలకే వార్నింగ్ ఇవ్వడంతో కలకలం రేగుతోంది. ఇంతకీ కుప్పంలో ఏం జరుగుతోంది? కుప్పంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్నింగ్స్..! కుప్పం మరోసారి పొలిటికల్ సర్కిళ్లలో హాట్ టాపిక్. టీడీపీ- జూనియర్ ఎన్టీఆర్కు మధ్య గ్యాప్ పెరుగుతుందా అనేట్టుగా అక్కడ పరిణామాలు చర్చకు దారితీస్తున్నాయి. తమ హీరోతో టీడీపీ నేతల వ్యవహారం…
ఏపీలో రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ అంటూ కుప్పంలో ఆయన అభిమానులు ఫ్లెక్సీలు కట్టి సందడి చేశారు. దీంతో ప్రస్తుతం ఏపీ వ్యాప్తంగా ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. దీనిపై జూనియర్ ఎన్టీఆర్ సంఘం అధ్యక్షుడు శివ పీసీ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారని, టీడీపీకే పనిచేస్తున్నామని కుప్పం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తెలిపారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతోనే సీఎం ఎన్టీఆర్ అనే…
అప్పులతో ఏపీ ఇమేజ్ను దెబ్బతీస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జగన్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పటికే రాష్ర్టంలో జగన్ చేసిన అప్పులతో దివాళ తీసే పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా అప్పులు చేయకుండా పరిపాలన చేయాలని జగన్కు సూచించారు. వరద నిర్వహణలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అధికార యంత్రాంగంపై న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. బాధితులకు ఇప్పటి వరకు నష్టపరిహారం ఇవ్వలేదని ప్రభుత్వంపై మండిపడ్డారు.…
చంద్రబాబు విమర్శలకు సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. ఆ పెద్ద మనిషివి బురద రాజకీయాలు అని చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. గతంలో కంటే… ఇప్పుడు వరద బాధితులకు తొందరగా సహాయాన్ని అందించగలిగారని పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు అన్నిరకాలుగా నష్టపరిహారాన్ని అందించామని… గతంలో ఇల్లు ధ్వంసమైతే పరిహారం అందడానికి నెలరోజులు పట్టేదని చంద్రబాబుకు చురకలు అంటించారు. దురదృష్టవశాత్తూ ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి పరిహారం ఇవ్వాలంటే నెలరోజులు పట్టేదని… గల్లైంతైన వారికి ఎలాంటి పరిహారం ఇచ్చేవారు కాదని ఫైర్…
పార్లమెంట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నేడు ఉదయం 11 గంటలకు పార్లమెంటు లైబ్రరీ భవనంలో అఖిలపక్ష సమావేశం జరగనుంది. తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ నాయకుడు గల్లా జయదేవ్, రాజ్యసభలో టీడీపీ నాయకుడు కనకమేడల రవీంద్ర కుమార్, వై.ఎస్.ఆర్ కాంగ్రెసు పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయిరెడ్డి హాజరవుతారు. టి.ఆర్.ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే.కేశవరావు, లోకసభ పక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు అఖిలపక్షానికి హాజరవుతారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు అన్ని పక్షాల…