డా. బీఆర్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీని మా నాయకుడు ఎన్టీఆర్ స్థాపించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంబేద్కర్ ఆశయాల కోసం ఎన్టీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆంశాలు భారతదేశానికే కాకుండా చాలా దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. అంబేద్కర్ దేశశిల్పి అంటూ కొనియాడారు. అంతేకాకుండా రాజ్యాంగం ఎంతమంచిదైనప్పటికీ పాలించేవారు మంచివారు కాకపోత చివరికి రాజ్యాంగం కూడా తప్పుగా…
అంబేడ్కర్ 65వ వర్థంతిని స్మరించుకుంటూ ఆ మహనీయునికి జాతీ మొత్తం ఘన నివాళుర్పిస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశమంతటా రాజ్యాంగం ఒకేలా అమలు చేస్తుందన్నారు. కానీ ఏపీలో మాత్రం రాజ్యాంగం రోజు రోజుకు అవహేళనకు గురవుతుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ర్టంలో రాజ్యాంగ విలువలు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఉన్న వైషమ్యాలు రూపుమాపాలని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు.…
భారీవర్షాలతో ఏపీలో పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరుపతిలో సైతం మునపెన్నడూ చూడనివిధంగా వరదలు పోటెత్తాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల సీఎం జగన్ పర్యటించారు. అంతేకాకుండా బాధితులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత సీఎం జగన్పై పలు విమర్శలు చేశారు. దీంతో చంద్రబాబు మాటలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. భారీ వర్షాలతో సంభవించిన వరదలను మానవ తప్పిదంగా చూపించాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని, అందుకే…
ఇటీవల ఏపీలో కురిసిన భారీ వర్షాలతో పలు జిల్లాల్లో వరదలు సంభవించాయి. అయితే వర్షాల కారణంగా భారీ వరద రావడంతో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయింది. దీంతో వరదలు సంభవించి ప్రాణ, ఆస్తి నష్టం చోటు చేసుకుంది. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించి వరద బాధితులకు అండగా ప్రభుత్వం ఉంటుందని అలాగే పలు వరాల జల్లులను కురిపించారు. ఆ తరువాత టీడీపీ నేతలు జగన్ పర్యటపై పలు విమర్శలు చేశారు. దీనిపై స్పందించిన వైసీపీ…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపై వైసిపి ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాలలో వేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అలాగే వైసిపి పార్టీ ల మధ్య వివాదం చెలరేగుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ తప్పు ఉంటే భువనేశ్వరి కాళ్లు కన్నీళ్లతో కడతామని… పేర్కొన్నారు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. మహిళలు…
భారీ వర్షాలతో మునుపెన్నడూ చూడనివిధంగా ఏపీలో వరదలు పోటేత్తాయి. భారీ వరదలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. దీంతో విపక్షాలతో పాటు కేంద మంత్రులు సైతం వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని ఆరోపణలు చేశారు. దీంతో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విపక్షాలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును ఉద్దేశించి మంత్రి అనిల్ మాట్లాడుతూ.. నీ ప్రచారం పిచ్చి వల్ల పుష్కరాల్లో చనిపోయిన కుటుంబాలకు ఎంత నష్టపరిహారం ఇచ్చావ్? అని ప్రశ్నించారు. రాయల్ చెరువు తెగి…
ఏపీలో జరిగిన రెండో విడత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ విశ్లేషణ చేస్తోంది. మరి.. కుప్పంలో ఓటమిపై చంద్రబాబు పోస్టుమార్టం చేస్తారా? ఆ దిశగా ఆలోచన ఉందా? పార్టీ ఆఫీస్కు వస్తున్న తమ్ముళ్లు వేస్తున్న ప్రశ్నలేంటి? రెండో విడత మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై టీడీపీ విశ్లేషణ..!కుప్పం ఓటమిపైనా పోస్టుమార్టం చేస్తున్నారా? మొదటి విడతలో ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించడంతో ఆ ఫలితాలపై విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదని భావించింది టీడీపీ. రెండో విడతలో జరిగిన…
జలప్రళయం ముంచుకొస్తోందని వాతావరణశాఖ హెచ్చరించినా తాడేపల్లి ప్యాలెస్లో పవళిస్తున్న జగన్ ఇంకా నిద్రలేవలేదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించిందని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ .. ఏపీ సీఎం జగన్ పై విమర్శల వర్షం కురింపించారు.వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయిందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాజ్యసభలో ప్రకటించారన్నారు. సీఎం జగన్ నిర్లక్ష్యం కారణంగా అధికారిక లెక్కల ప్రకారమే 39…