టీడీపీ సీనియర్ నేత… గోరంట్ల బుచ్చ చౌదరికి బొత్స సత్య నారాయణ సవాల్ విసిరారు. తాను అబద్దాలు ఆడుతున్నానని బుచ్చయ్య చౌదరి అంటున్నారని… ధైర్యం ఉంటే చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఎవరి వాదం ఏంటో చెబుదామని… రా…ఇద్దరం రాజీనామా చేద్దామని పేర్కొన్నారు బొత్స సత్య నారాయణ. ఇంత వయసు ఉండి అర్ధం లేకుండా మాట్లాడితే ఎలా? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు గురువింద గింజలాంటి వ్యక్తి అని.. ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుకు సందర్భంతో సంబంధం లేదని… మీడియా మైకులు చూస్తే చాలు కడుపులోని ఆక్రోశం అంతా కక్కేస్తాడన్నారు. మేము అంబేద్కర్ విగ్రహాన్ని కట్టలేదని చంద్రబాబు చెప్పారని.. 2016లో తాను జీవో ఇచ్చినట్లు చంద్రబాబే చెప్పారు…మరి 2019 వరకు ఎందుకు కట్టలేదని ప్రశ్నించారు. కాల్ మనీ ఎపిసోడ్ నుంచి ప్రజలను డైవర్ట్ చేయటానికే జీఓ తీసుకుని వచ్చారని.. రాజ్యాంగాన్ని చేతుల్లోకి తీసుకుని అప్పట్లో కార్యక్రమాలు చేశారని మండిపడ్డారు. మా ఎమ్మెల్యే లను తీసుకుని ఏకంగా మంత్రులను కూడా చేశాడని.. మరి ఇది రాజ్యాంగ స్ఫూర్తియేనా? అని నిలదీశారు.