భారీవర్షాలతో ఏపీలో పలు జిల్లాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరుపతిలో సైతం మునపెన్నడూ చూడనివిధంగా వరదలు పోటెత్తాయి. అయితే వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇటీవల సీఎం జగన్ పర్యటించారు. అంతేకాకుండా బాధితులు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత సీఎం జగన్‌పై పలు విమర్శలు చేశారు. దీంతో చంద్రబాబు మాటలకు వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు.
భారీ వర్షాలతో సంభవించిన వరదలను మానవ తప్పిదంగా చూపించాలని చంద్రబాబు తాపత్రయ పడుతున్నారని, అందుకే ఫ్రస్టేషన్‌లో బుద్ధుందా లేదా అంటూ ప్రజలపైనే తిరగబడుతున్నారని ఎద్దేవా చేశారు. అధికార వ్యామోహంతో చంద్రబాబుకు పిచ్చెక్కిందని, వెంటనే మెంటల్ హాస్పిటల్ లో చేర్పించి చికిత్స అందించాలని ఆయన విమర్శించారు.