టీడీపీ అధినేత చంద్రబాబు డా.బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వ ఆ హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఉరి వేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలకు కౌంటర్ గా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.