బాహుబలి సైన్యంలా వెళ్లారు. తీరా యుద్ధంలో చతికిల పడ్డారు. 20వార్డులకు రెండుచోట్లే గెలిచారు. ఈ ఫలితాలతో ఆ జిల్లా నేతలకు అధినేత నుంచి అక్షింతలు పడ్డాయట. డైలాగ్ కొంచెం తేడా కావొచ్చేమో కానీ.. తమ్ముళ్లకు సీరియస్‌గానే తలంటారట. టీడీపీలో చర్చగా మారిన ఆ పోస్టుమార్టం ఏంటి? లెట్స్ వాచ్..! పెనుకొండ పురపోరులో పాతికమంది టీడీపీ నేతల ప్రచారం..! రాష్ట్రంలో ఇటీవల జరిగిన మినీ మున్సిపల్ పోరు పొలిటికల్ హీట్ క్రియేట్ చేసింది. కుప్పం తరువాత అంత హైప్…
కర్నూలు జిల్లా టీడీపీలో ఎవరి దుకాణం వాళ్లదేనా? ఎమ్మిగనూరు.. ఆలూరులో సొంత పార్టీలోనే రచ్చ మొదలైందా? ఇప్పటికే ఇంఛార్జులు ఉన్న నియోజకవర్గాల్లో పక్క నేతలు వచ్చి చేరడం ఆసక్తిగా మారింది. కోట్ల వర్గం ఓ మాజీకి ఝలక్ ఇస్తే ఇంకో మాజీ.. కోట్ల కుటుంబానికే షాక్ ఇచ్చేలా ఆఫీస్ తెరిచారట. ఎమ్మిగనూరులో కోట్ల మరో ఆఫీస్ తెరవడంతో కొత్త చర్చ..! కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల్లో టీడీపీ వర్గపోరు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఎమ్మిగనూరులో కేంద్ర…
ఓటీఎస్ పేరుతో ప్రభుత్వం నిర్భంద వసూళ్లకు పాల్పడుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ …వైసీపీ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు. అధికారులకు టార్గెట్ ఇచ్చి అక్రమంగా ఓటీఎస్ పేరుతో వసూళ్లు చేస్తున్నారని మండిపడ్డారు. మీడియా ముఖంగా నిరూపించడానికి బహిరంగ చర్చకు నేను సిద్ధం.. మంత్రి బొత్స అబద్ధాలడుతున్నారని, ముఖ్యమంత్రికి జగన్నే సవాల్ చేస్తున్నాని ఆయన అన్నారు. నిరూపించపోతే మేము రాజీనామా చేస్తాం.. నిరూపిస్తే…
క్షేత్ర స్థాయిలో గందరగోళ పరిస్థితులు నెలకొనడం.. ఓటీఎస్ పథకంపై ప్రజల్లో అవగాహన పెంచేదుకు అధికార వైసీపీ మల్లగుల్లాలు పడుతోంది. ప్రజా ప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్సులు నిర్వహించి దీనిపై స్పష్టంగా వివరిస్తున్నారు. గతంలో హౌసింగ్ బోర్డుల కింద అప్పులు తీసుకుని … ఆ అప్పులు కట్టకపోవడం వల్ల ఆగిపోయిన రిజిస్ట్రేషన్ల సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం తీసుకుని వచ్చిందే వన్ టైమ్ సెటిల్ మెంట్ పథకం. ఈ పథకం కింద డీ ఫార్మ్ పట్టాల్లో కట్టిన ఇళ్లకు కూడా…
టీడీపీ సీనియర్ నేత… గోరంట్ల బుచ్చ చౌదరికి బొత్స సత్య నారాయణ సవాల్ విసిరారు. తాను అబద్దాలు ఆడుతున్నానని బుచ్చయ్య చౌదరి అంటున్నారని… ధైర్యం ఉంటే చర్చకు రావాలని బహిరంగ సవాల్ విసిరారు. ఎవరి వాదం ఏంటో చెబుదామని… రా…ఇద్దరం రాజీనామా చేద్దామని పేర్కొన్నారు బొత్స సత్య నారాయణ. ఇంత వయసు ఉండి అర్ధం లేకుండా మాట్లాడితే ఎలా? అని ఫైర్ అయ్యారు. చంద్రబాబు గురువింద గింజలాంటి వ్యక్తి అని.. ఆయన ఏం మాట్లాడతాడో ఎవరికీ తెలియదని…
టీడీపీ అధినేత చంద్రబాబు డా.బీఆర్ అంబేద్కర్ వర్థంతి సందర్బంగా నివాళులు అర్పించారు. అంతేకాకుండా రాజ్యాంగంలో ప్రతి ఒక్కరికీ హక్కులు ఉన్నాయంటూ వైసీపీ ప్రభుత్వ ఆ హక్కులను కాలరాస్తుందని తీవ్రంగా విమర్శించారు. అంతేకాకుండా ఓటీఎస్ పేరుతో ప్రజలకు వైసీపీ ప్రభుత్వం ఉరి వేస్తోందని చంద్రబాబు ఆరోపించారు. అయితే ఈ నేపథ్యంలో చంద్రబాబు మాటలకు కౌంటర్ గా వైసీపీ నేత, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.
వైసీపీ సర్కార్ పై చంద్రబాబు మరోసారి మండిపడ్డారు. ఓటీఎస్ పేదల మెడకు ఉరితాడుగా మారుతోందని పేర్కొన్నారు. ఇళ్లకు సీఎం భూమి ఇచ్చారా? రుణం ఇచ్చారా?.. ఎన్టీఆర్ కట్టించిన ఇళ్లకి ఇప్పుడు డబ్బులు వసూలు చేయడమేంటి? అని చంద్రబాబు నిలదీశారు. కంపల్సరీ కాదంటూనే ఓటీఎస్ కోసం ఒత్తిడి చేస్తున్నారని… బలవంతంగా ఓటీఎస్ పేరుతో సొమ్ము వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా బలవంతంగా వసూళ్లు చేస్తున్నారని విమర్శలు చేస్తోంటే కేసులు పెడతారా..? అని నిలదీశారు. ఛీటింగ్ కేసులు..…
డా. బీఆర్ అంబేద్కర్‌ను స్ఫూర్తిగా తీసుకుని తెలుగుదేశం పార్టీని మా నాయకుడు ఎన్టీఆర్ స్థాపించారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… అంబేద్కర్ ఆశయాల కోసం ఎన్టీఆర్ కృషి చేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆంశాలు భారతదేశానికే కాకుండా చాలా దేశాలకు ఆదర్శంగా నిలిచాయన్నారు. అంబేద్కర్ దేశశిల్పి అంటూ కొనియాడారు. అంతేకాకుండా రాజ్యాంగం ఎంతమంచిదైనప్పటికీ పాలించేవారు మంచివారు కాకపోత చివరికి రాజ్యాంగం కూడా తప్పుగా…
అంబేడ్కర్ 65వ వర్థంతిని స్మరించుకుంటూ ఆ మహనీయునికి జాతీ మొత్తం ఘన నివాళుర్పిస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశమంతటా రాజ్యాంగం ఒకేలా అమలు చేస్తుందన్నారు. కానీ ఏపీలో మాత్రం రాజ్యాంగం రోజు రోజుకు అవహేళనకు గురవుతుందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ర్టంలో రాజ్యాంగ విలువలు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఉన్న వైషమ్యాలు రూపుమాపాలని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు.…