ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్న ఆయన.. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి తనకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. తన క్యారెక్టర్ గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారు.. ఇప్పటికి ఎన్నోసార్లు తన క్యారెక్టర్ పై తీవ్రమైన విమర్శలు చేసినా.. నేనెక్కడా సహనం కోల్పోలేదన్నారు.. తనపై వ్యక్తిగత విమర్శలు వేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్ కి…
EX MLA Prasanna Kumar Reddy: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్ లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్ తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
గంటా శ్రీనివాసరావు....తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరంలేని నాయకుడు. ఆయన పొలిటికల్ సక్సెస్ల సంగతి ఎలా ఉన్నా... ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారని మాత్రం గట్టిగా చెప్పుకుంటుంటాయి రాజకీయ వర్గాలు.
2024 అసెంబ్లీ ఎన్నికల్లో... ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మొత్తం 14 స్థానాలకు గాను 12 చోట్ల గెలిచింది కూటమి. సీఎం చంద్రబాబు సొంత జిల్లాలో గతంలో ఎప్పుడూ ఈ స్థాయి విజయం దక్కలేదు. అయినాసరే... ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు జిల్లా టీడీపీ ద్వితీయ శ్రేణికి మింగుడు పడటం లేదట. తోతాపురి మామిడికి గిట్టుబాటు ధర విషయంలో అంత రచ్చ జరుగుతున్నా.
సాక్షాత్తు జగనే వాయిదాలు ఎగ్గొట్టి తిరుగుతున్నాడు.. చిత్తశుద్ధి ఉంటే కోర్టులలో తమ తప్పు లేదని నిరూపించుకోవాలని సూచించారు. అధికారంలో ఉండగా మాపై జగన్ పెట్టించినవి అక్రమ కేసులని నిరూపించుకోలేదా?.. కేసులపై ఇప్పుడెందుకు నీతి కబుర్లు చెబుతున్నారు? అని అడిగారు. మాకు శత్రువులంటూ ఎవరూ లేరు.. చట్టానికి వ్యతిరేకంగా వెళ్తే సహించేది లేదు అని కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.
Minister Anagani: స్వర్ణాంధ్ర విజన్- 2047లో భాగంగా డిస్ట్రిక్ట్ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్(DVAPU) పీ4 కార్యక్రమంపై జరిగిన సమావేశంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్-1 గా ఉండేలా సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ కు రూపకల్పన చేశాడని తెలిపారు.
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటనలపై ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దండయాత్ర చేస్తానంటే ఊరుకోమంటూ హెచ్చరించారు. అధికారం ఉందని విర్రవీగితే ప్రజలే సమాధానం చెప్తారన్నారు. ప్రజలకు అనుగుణంగా ప్రభుత్వాలు పని చేయాలన్నారు. ధర్నాల పేరుతో వైసీపీ నేతలు దోపిడికి తెగబడుతున్నారని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వం రైతులను గాలికి వదిలేసిందని, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు వినియోగించకపోవడంతో వ్యవసాయ రంగం చిన్నా భిన్నమైందని మంత్రి అచ్చెన్నాయుడు…
CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలంలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తి నాగార్జున సాగర్ కు నీరు విడుదల చేయనున్నారు. పూర్తి స్థాయి నీటిమట్టానికి చేరువలో శ్రీశైలం ప్రాజెక్టు ఉంది.
Botsa Satyanarayana: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.