MLA Prashanthi Reddy: ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి.. వదిలే ప్రసక్తే లేదన్న ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి..
- ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడికి తనకి ఎలాంటి సంబంధం లేదు..
- తన క్యారెక్టర్ గురించి ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారు..
- నేనెక్కడా సహనం కోల్పోలేదన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..
- తనపై వ్యక్తిగత విమర్శలు వేసిన ప్రసన్నపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేస్తా..
- ప్రసన్న కుమార్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ప్రశాంతి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Prashanthi Reddy: నెల్లూరులో పొలిటికల్ హీట్ పెరిగిపోయింది.. వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది.. అయితే, నా ఇంటిని టీడీపీ నేతలు విధ్వంసం చేశారు.. మేం అధికారంలోకొస్తే ఇలాంటి విధ్వంసానికి పాల్పడం.. కానీ, సరైన రీతిలోని బుద్ధి చెబుతాం అని ప్రసన్న కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.. ఇక, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి తనకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. తన క్యారెక్టర్ గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారు.. ఇప్పటికి ఎన్నోసార్లు తన క్యారెక్టర్ పై తీవ్రమైన విమర్శలు చేసినా.. నేనెక్కడా సహనం కోల్పోలేదన్నారు..
Read Also: Xiaomi Power Bank: ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనేలా.. 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ లాంచ్..!
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
ఇక, ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన ఈ దాడితో నాకు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. దాడి విషయం నాకు తెలిసే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయిందన్న ఆమె.. నాపై అసభ్యకరంగా మాట్లాడటాన్ని జీర్ణించుకోలేక అభిమానులు, మహిళలు దాడి చేశారేమో నాకు తెలియదు అన్నారు.. రాజకీయపరంగానే నేను విమర్శలు చేశాను తప్ప.. ఎక్కడా వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు.. దాడుల సంస్కృతి మాకు లేదు.. ప్రజాసేవ చేయడమే మాకు తెలుసు అని పేర్కొన్నారు.. నాపై చేసిన వ్యాఖ్యలను వైసీపీలో ఉండే మహిళలు సమర్ధిస్తారా..? ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో ఉండే మహిళలు సమర్థిస్తారా..? అంటూ ప్రశ్నించారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..
Read Also: Harrier EV vs Creta EV: హారియర్ లేదా క్రెటా..? ఏ ఎలక్ట్రిక్ మోడల్ బెస్ట్.. ఎందుకు..?
మరోవైపు, మీడియాతో మాట్లాడుతూ.. హాట్ కామెంట్లు చేశారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. తనపై వ్యక్తిగత విమర్శలు వేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేస్తా అన్నారు.. ప్రసన్న కుమార్ రెడ్డిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.. వైసీపీ నేతలు మహిళలపై అసభ్యకరంగా మాట్లాడాలంటే భయపడేలా చర్యలు తీసుకోవాలని కోరతా అన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!