Atchannaidu: 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకులో CNG గ్యాస్ ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి త్రికరణశుద్ధితో చెప్పిన హామీలు.. 13 నెలలు అయినా ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరుపున అడిగే హక్కు ఉంది.
మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అంటూ ప్రశ్నించారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలకు, అందులోనూ ప్రత్యేకించి టీడీపీ వాళ్ళకు ఏమైందని హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండడమే కాకుండా కనీసం వైసిపి విమర్శలకు సైతం కౌంటర్ ఇవ్వాలన్న స్పృహ కూడా ఎందుకు ఉండటం లేదని పార్టీ కేడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి.
మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా.. రాష్ట్రంలో పాలన ఉంది అంటూ కూటమి సర్కార్‌పై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ప్రతిరోజూ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా? అని ప్రశ్నించారు.
మామిడి రైతులకు అండగా నిలిచింది కూటమి ప్రభుత్వం.. మామిడి రైతుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనవసర రాజకీయాలు చేస్తుందంటూ మండిపడుతున్నారు ప్రభుత్వ పెద్దలు.. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా కిలోకి 4 సబ్సిడీ ఇచ్చి రైతులకు అండగా నిలబడిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నష్టాన్ని ముందుగానే అంచనా వేసి మామిడి రైతులను ఆదుకోవాలని సబ్సిడీ ఇచ్చామంటున్నాయి ప్రభుత్వ వర్గాలు..
దేశం కోసం, దేశ ప్రజలకు స్వేచ్ఛ కోసం అతి చిన్న వయస్సులోనే ప్రాణాలర్పించిన గొప్ప పోరాట స్ఫూర్తి ప్రధాత అల్లూరి సీతారామరాజు అని ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతిని పురష్కరించుకుని రాజమండ్రి బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన సభలో సోము వీర్రాజు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు, స్వామి వివేకానంద చిత్రపటాలకి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణా రెడ్డితో కలిసి వీర్రాజు పూలమాల వేసి నివాళులర్పించారు. Also Read: Pawan…
దెందులూరు నియోజకవర్గంలో కేసులు, కొట్లాటలతో వైసీపీ కార్యకర్తలను కూటమి నేతలు అనేక ఇబ్బందులు పెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంచితనం చేతకానితనం కాదని, కాలమే అన్నిటికి సమాధానం చెబుతుందన్నారు. రానున్న రోజుల్లో అబ్బయ్య చౌదరి 2.0 చూపిస్తా అని హెచ్చరించారు. దెందులూరులో అబ్బయ్య చౌదరిని తప్పిస్తే రాజకీయం తాము చేసుకోవచ్చని కొందరు భావిస్తున్నారని, అలాంటివి ఏమీ కుదరవన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఏ ఒక్కరికి తాను బాకీ లేను అని అబ్బయ్య చౌదరి…
కోట్ల సూర్య ప్రష్రెడ్డి... ఏపీ పాలిటిక్స్‌లో పరిచయం అక్కర్లేని పేరు. ప్రస్తుతం నంద్యాల జిల్లా డోన్ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారాయన. గతంలో కాంగ్రెస్ తరపున 3 సార్లు ఎంపీగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేశారాయన. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన కుటుంబం కోట్లది. 2019 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు సూర్య ప్రకాష్‌రెడ్డి. తర్వాత 2024 ఎన్నికల్లో డోన్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారాయన.