Off The Record: ఆ ఉమ్మడి జిల్లాలో ఓ కులానికి చెందిన తెలుగుదేశం నాయకులు కుదురుగా ఉండలేకపోతున్నారా? ఇలాగే వదిలేస్తే… ఇక కమునరుగైపోతామని భయపడుతున్నారా? అందుకే మెల్లిగా వాయిస్ రెయిజ్ చేస్తున్నారా? అధికార పార్టీ ఉండి కూడా అంతలా భయపడుతున్న ఆ నాయకులు ఎవరు? వాళ్ళ భయానికి కారణాలేంటి?
Read Also: Pocso Act: మైనర్ బాలికపై కన్నేస్తే.. ఏళ్ల తరబడి చిప్ప కూడే! పోకిరీలు జర జాగ్రత్త
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కాపు తమ్ముళ్లు కంఫర్ట్‌గా ఉండలేకపోతున్నారట. పార్టీ అధికారంలో ఉన్నా.. తమకు ప్రయారిటీ ఉండడంలేదంటూ ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువగా ఫీలైపోతున్నట్టు చెప్పుకుంటున్నారు జిల్లాలో. అటు టీడీపీ అధిష్టానం వ్యవహారం కూడా అలాగే ఉందని, కనీసం తమ గోడు విన్న పాపాన పోలేందంటూ ఓపెన్‌గానే స్టేట్మెంట్లు ఇచ్చేస్తున్నారు సీనియర్ లీడర్స్. అసలు లోకల్‌గా తమ సామాజిక వర్గానికి సంబంధించిన పేటెంట్ రైట్స్ మొత్తాన్ని జనసేనకు రాసిచ్చేసినట్టుగా ప్రవర్తిస్తున్నారని, అలాగైతే.. దశాబ్దాలుగా టీడీపీనే నమ్ముకుని ఉన్న మేం ఏమైపోవాలంటూ.. బరస్ట్ అవుతున్నట్టు సమాచారం. అలా ఫ్రస్ట్రేషన్‌లో ఉన్న టీడీపీ కాపు నాయకులు.. అధిష్టానం మీద వత్తిడి పెంచేందుకు తాజాగా, ప్లాన్ మారుస్తున్నారట. ఇటీవల వంగవీటి రంగా జయంతి సందర్భంగా ఆయన కుమారుడు రాధాను తీసుకుని వచ్చి రెండు రోజుల పాటు కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా.. జిల్లాలో తమ ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా మేల్కొనకపోతే.. పార్టీతో పాటు సొంత సామాజికవర్గం కూడా తమను మర్చిపోతుందేమోనని భయపడుతున్నారట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా టీడీపీ కాపు నేతలు.
Read Also: Khammam: భర్త డ్యూటీకి వెళ్లగానే మామతో శారీరక సంబంధం.. చూసిన 11 ఏళ్ల బాలికను..
అందుకే, గతంలో ఎప్పుడూ లేనివిధంగా కాపు ప్రజా ప్రతినిధులు, నేతలు మాత్రమే రావాలని చెప్పిమరీ.. కాకినాడలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కేవలం జనసేనను చూసి మాత్రమే కాపుల ఓట్లు పడ్డట్టు…పార్టీ పెద్దలు అనుకుంటున్నారని, దాని మీద వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని సమావేశంలో అభిప్రాయ పడ్డారట. మెజారిటీ ఓట్లు గ్లాస్ పార్టీ వల్ల పడ్డాయంటే ఒప్పుకుంటాంగానీ… తాము అసలు పనికిరామన్నట్టుగా పార్టీ పెద్దలు భావించడం కరెక్ట్ కాదని మీటింగ్‌లో పాల్గొన్న నాయకులు అభిప్రాయపడ్డట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో మొత్తం 19 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో టిడిపికి 14 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో నలుగురిది కాపు సామాజికవర్గం. ఒక రాజ్యసభ ఎంపీ, ఎమ్మెల్సీది కూడా అదే క్యాస్ట్. తెలుగుదేశం తరపున ఇంత మంది ప్రజాప్రతినిధులు, ఉన్నా.. వాళ్ళ అనుచరులకు పదవులు లేకుండా.. కాపు కోటా పోస్ట్‌లన్నీ జనసేనకే ఇచ్చేస్తున్నారంటూ ద్వితీయ శ్రేణి కూడా అసహనంగా ఉందట. వాళ్ళకు ఏం సమాధానం చెప్పాలని ఎమ్మెల్యేలు తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. పార్టీలో సీనియర్ మోస్ట్ లీడర్స్ ఉన్నాం.. కానీ, తమను కాదని మెజారిటీ పదవులు జనసేనలోని కాపులకు మాత్రమే ఇస్తే ఎలాగని సమావేశంలో చర్చించుకున్నారట.
Read Also: Off The Record: స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో బీజేపీ వ్యూహం మారబోతోందా..?
ఇక, ఈ మీటింగ్‌కు కాపు ఎమ్మెల్యేలు రాజప్ప, జ్యోతుల నెహ్రూ సత్యప్రభ, ఎంపీ సానా సతీష్, ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ హాజరై తమ అభిప్రాయాలను చెప్పినట్టు సమాచారం. అసలు తమకు పదవులు రాకపోవడానికి జనసేనే కారణమంటూ ఘొల్లుమన్నారట కొందరు నాయకులు. జనసేనలో ఉన్న మిగతా సామాజిక వర్గాలకు పదవులు ఇచ్చేందుకు ఆ పార్టీ ఎందుకు ప్రయత్నం చేయడం లేదని చర్చించారట.. కాపులలో తమకు కూడా పట్టు ఉందని, ఆ విషయాన్ని పార్టీ గుర్తించాలి కదా అంటున్నారట టీడీపీ నాయకులు. ఇకనుంచి అవసరమైతే పార్టీ గుర్తించేలా సమావేశాలు పెట్టాలన్న ప్రస్తావన కూడా వచ్చిందంటున్నారు. పార్టీ తరపున పరిగణనలోకి తీసుకోకపోతే ఇక కులంలో బలం ఎలా ఉంటుందన్నది వాళ్ళ ఆవేదనగా తెలిసింది. ఎవరు అవునన్నా, కాదన్నా… వంగవీటి రంగా ప్రభావం కచ్చితంగా కాపు కమ్యూనిటీలో ఉంటుంది.
Read Also: Top Headlines @9PM : టాప్ న్యూస్!
అందుకే, ఆయన వారసుడిగా రాధాను పిలిచి కార్యక్రమం నిర్వహించడం ద్వారా… కమ్యూనిటీలో తమకు కచ్చితంగా మైలేజ్ వస్తుందని చర్చించుకున్నారట తెలుగుదేశం నాయకులు. దానికి అనుగుణంగానే పార్టీ పెద్దలను కూడా కలవాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఒక ప్రాంతంలో ఒక సామాజిక వర్గానికి పార్టీలో అన్యాయం జరుగుతుందని, ఆ కోణంలో ఇకనుంచి వాయిస్ రెయిజ్ చేయాలని ఫిక్స్ అయ్యారట.కాపు సామాజిక వర్గంలో టిడిపి నేతలు కంఫర్ట్ గా ఉండేలా క్లారిటీ ఇవ్వాలని, అవసరమైతే దాని కోసం పార్టీపై ఒత్తిడి తేవాలని డిసైడ్ అయ్యారట ఉమ్మడి తూర్పుగోదావరి నేతలు. మొత్తానికి గతంలో ఎప్పుడు లేని విధంగా జిల్లా టిడిపి కాపు నేతలు కదులుతున్నారు. పరిస్థితి చేయి దాటిపోతే అసలు పట్టించుకోరన్న భయంతో… అడ్వాన్స్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారట. వీళ్ల మొరను టీడీపీ అధిష్టానం ఎలా వింటుందో, జనసేనతో ఎలా బ్యాలెన్స్ చేసుకుంటుందో చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.