Jowar Idli Recipe: వెయిట్ లాస్ కోసం హెల్తీ, టేస్టీ బ్రేక్‌ఫాస్ట్.. ఇంట్లోనే ఈజీగా సాఫ్ట్ జొన్న ఇడ్లీలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jowar Idli Recipe: ప్రస్తుతం వయసుకు సంబంధం లేకుండా బరువు పెరుగుతున్నారు. ఇలా అధిక బరువుతో బాధపడేవారు దాన్ని తగ్గించుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తుంటారు. కొందరు విపరీతమైన వర్కవుట్లు చేస్తే, మరికొందరు ఆహారపుటలవాట్లు మార్చుకుంటారు. ఇంకొందరైతే బరువు తగ్గాలని తిండి కూడా మానేస్తుంటారు. అయితే ఇలా నోరు కట్టేసుకొని బరువు తగ్గించుకునే బదులు కొన్ని రకాల చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం మేలంటున్నారు పోషకాహార నిపుణులు. ప్రత్యేకించి జొన్నలతో చేసిన వంటకాలను తరచుగా తీసుకోవడం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవచ్చంటున్నారు. ఇలాంటి వాళ్ల కోసం ప్రస్తుతం జొన్నలతో ఈజీగా, టేస్టీగా చేసుకునే జొన్న ఇడ్లీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం..
Also Read
- Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
- Paramannam: బెల్లం పరమాన్నం మొదటిసారి చేసినా సూపర్ హిట్ అయ్యే 100% పక్కా ఫార్ములా! ఇలా చేసి చూడండి..
- Janthikalu Recipe: ఇంట్లోనే కరకరలాడే జంతికలు.. పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ పాటించండి
- Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే 'పనసకాయ దమ్ బిర్యానీ' రుచి చూసేయండి.!
జొన్న ఇడ్లీకి కావలసిన పదార్థాలు:
జొన్న పిండి – ఒక కప్పు
మినప్పప్పు – అర కప్పు
మెంతులు – పావు చిన్న చెంచా
ఉప్పు – తగినంత
నీరు – అవసరానికి సరిపడా
వడ్డించడానికి – కొబ్బరి చట్నీ లేదా సాంబారు
READ MORE: Donald Trump: 11 యుద్ధ విమానాలు కూలిపోయాయి.. ట్రంప్ నోట మళ్లీ అదే మాట..
తయారీ విధానం
మొదట ఒక గిన్నెలో జొన్న పిండి, మినప్పప్పు, మెంతులు వేసి నీరు కలిపి ముద్దలా చేయాలి. ఈ మిశ్రమాన్ని రాత్రంతా మూతపెట్టి ఉంచాలి. ఉదయానికి అది ఉబ్బి మృదువుగా మారుతుంది. ఇదే ఇడ్లీలకు మెత్తదనాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఉప్పు వేసి మెల్లగా కలపాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె రాసి ముద్దను పోయాలి. ఆవిరిలో పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికించాలి. ఉడికిన తర్వాత మోల్డ్ నుంచి తీసి వేడిగా వడ్డించాలి. ఈ ముద్దలో క్యారెట్ తురుము, పాలకూర ముక్కలు లేదా కొబ్బరి తురుము కలిపితే రంగు, రుచి, పోషకాలు ఇంకా పెరుగుతాయి. ఇడ్లీ ప్లేట్లు లేకపోతే చిన్న గిన్నెల్లో కూడా ఆవిరి మీద ఉడికించవచ్చు. వేడిగా ఉన్నప్పుడే తింటే ఇవి చాలా రుచిగా ఉంటాయి. మిగిలితే గాలి పోకుండా మూత ఉన్న డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో రెండు రోజుల వరకు ఉంచవచ్చు. మళ్లీ తినాలంటే కొద్దిసేపు ఆవిరిలో పెట్టినా లేదా ముప్పై సెకన్లు వేడి చేసినా మళ్లీ మెత్తగా అవుతాయి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!