Deputy CM Pawan Kalyan: కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.. ఆ తర్వాత నెల్లూరులోని ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు.. అయితే, దాడుల సంస్కృతి తమది కాదని.. ఆ దాడితో తమకు సంబంధం లేదని ప్రశాంతిరెడ్డి స్పష్టం చేయగా.. ఇది టీడీపీ వాళ్ల పనే అంటున్నారు ప్రసన్నకుమార్ రెడ్డి.. అయితే, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్న ఆయన.. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.
Read Also: Tragedy : వీధి కుక్కల దాడిలో వృద్ధుడి మృతి.. వికారాబాద్ జిల్లాలో విషాదం
కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిపై ఆ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమైనవి. ఆ మాటలకి సభ్య సమాజం సిగ్గుపడుతుందన్నారు పవన్ కల్యాణ్.. వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకొని వ్యాఖ్యలు చేయడం, మహిళలను కించపరచడాన్ని ప్రజాస్వామికవాదులందరూ ఖండించాలన్నారు.. ప్రశాంతి రెడ్డిపైనా, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పైనా సదరు మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు అందరికీ బాధ కలిగించాయన్నారు.. అయితే, మహిళల గౌరవానికి భంగం కలిగించినా, అసభ్య వ్యాఖ్యలు చేసినా చట్ట ప్రకారం చర్యలుంటాయని స్పష్టం చేశారు పవన్ కల్యాణ్.
Read Also: Xiaomi Power Bank: ‘పిట్ట కొంచెం కూత ఘనం’ అనేలా.. 20,000mAh కంపాక్ట్ పవర్ బ్యాంక్ లాంచ్..!
ఇక, అధికారంలో ఉన్నప్పుడూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నోటి వదరుతో అసభ్యంగా వ్యాఖ్యలు చేశారు.. నిండు శాసనసభలో కూడా అదే విధంగా మాట్లాడటంతో… ప్రజలు సరైన రీతిలో తీర్పు చెప్పారని గుర్తుచేశారు పవన్ కల్యాణ్.. అయినప్పటికీ వదరుబోతు మాటలు వదల్లేకపోతున్నారు. మహిళా సమాజం మరోసారి ఆ పార్టీకి తగిన విధంగా సమాధానం చెబుతుందని హెచ్చరించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్..