వైఎస్ జగన్ పర్యటన పేరుతో సైకోలతో కలిసి వ్యర్థం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇక, ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగా పసిగట్టి.. వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు పెడుతున్నారని సంచలన వ్యాఖ్యలు మంత్రి వాసంశెట్టి సుభాష్
CM Chandrababu: క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న టీడీపీ పార్టీ కార్యకర్త అభిమతాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర్చారు. తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆకుల కృష్ణతో చంద్రబాబు వీడియో కాల్ లో మాట్లాడారు.
Minister Kollu Ravindra: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు అధికారం కోల్పోయి మతిభ్రమించి మాట్లాడుతున్నారు అని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐదేళ్ల పాటు అరాచకాలు చేసి.. ప్రజలను పీడించుకొని తిని.. ఈరోజు నీతులు చెబుతున్నారు అని పేర్కొన్నారు.
CM Chandrababu: ఉండవల్లి నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 50వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం ముగిసింది. రాజధాని పరిధిలోని అమరావతి మండలంలో 4, తుళ్లూరు మండలంలో 3 గ్రామాల్లో అదనంగా 20, 494 ఎకరాల మేర భూ సమీకరణకు సీఆర్డీఏ అథారిటీ ఆమోదం తెలిపింది.
Atchannaidu: 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నడిచే పెట్రోల్ బంకులో CNG గ్యాస్ ను మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి అడుగు కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అని చెప్పుకొచ్చారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి త్రికరణశుద్ధితో చెప్పిన హామీలు.. 13 నెలలు అయినా ఎప్పుడు అమలు చేస్తారని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. 40 శాతం ఓట్లు ఉన్న మాకు ప్రజలు తరుపున అడిగే హక్కు ఉంది.
మాఫియా తరహాలో రాష్ట్రాన్ని నడుపుతున్న చంద్రబాబుకు అసలు పదవిలో ఉండే అర్హత ఉందా? రాజకీయ నాయకులకు, పౌరులకు రక్షణ లేని ఈ రాష్ట్రంలో, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘిస్తూ, లా అండ్ ఆర్డర్ కాపాడలేని పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు పెట్టకూడదు అంటూ ప్రశ్నించారు.. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్, పొలిటికల్ గవర్నన్స్‌లతో ఆంధ్రప్రదేశ్ రక్తమోడుతోంది
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూటమి ఎమ్మెల్యేలకు, అందులోనూ ప్రత్యేకించి టీడీపీ వాళ్ళకు ఏమైందని హాట్ హాట్‌గా చర్చించుకుంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు ఉండడమే కాకుండా కనీసం వైసిపి విమర్శలకు సైతం కౌంటర్ ఇవ్వాలన్న స్పృహ కూడా ఎందుకు ఉండటం లేదని పార్టీ కేడరే మాట్లాడుకుంటున్న పరిస్థితి.
మూడు దాడులు, ఆరు తప్పుడు కేసుల్లా.. రాష్ట్రంలో పాలన ఉంది అంటూ కూటమి సర్కార్‌పై మండిపడ్డారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. ప్రతిరోజూ వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తూనే ఉన్నారు. మన్నవ సర్పంచ్ నాగమల్లేశ్వరరావును చంపేందుకు ప్రయత్నించారు. పొన్నూరు ఎమ్మెల్యేకి తెలియకుండానే ఈ హత్యాయత్నం జరిగిందా? అని ప్రశ్నించారు.