Minister Anam: నెల్లూరు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఘాటుగా స్పందించారు. సభ్య సమాజం తలదించుకునేలా మహిళ శాసన సభ్యురాలు ప్రశాంతి రెడ్డిపై వైసీపీ నాయకుడు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు. మహిళలపై ఇష్టానుసారంగా మాట్లాడే వైసీపీ నేతల సంస్కృతి తగదు.. ప్రజలు పట్టుమని 11 సీట్లతో బుద్ధి చెప్పినా.. వైసీపీ నేతల వైఖరిలో, భాషలో ఇంకా మార్పు రావడం లేదని విమర్శించారు. వైసీపీ నేతల మాటలు మహిళల ఆత్మగౌరవాన్ని తూట్లు పొడుస్తున్నాయి.. అనడంలో సందేహం లేదన్నారు. మహిళల గౌరవాన్ని తుంచే చింతనను తిప్పి కొట్టాలి.. వైసీపీ నాయకుడు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై చట్టపరమైన చర్యలు తప్పవు.. వైసీపీ నాయకత్వం కూడ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సూచించారు.