Minister Payyavula: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజలు, ఖజానాపై మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాగా ప్రేమ చూపిస్తున్నారు అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. కుట్ర పన్నారు అనే స్టేట్మెంట్ నేను ఇవ్వట్లేదు.. బ్రాండ్ ఆంద్రప్రదేశ్ ను నాశనం చేస్తున్నారు అని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ నిధుల కోసం ఏపీ మైనింగ్ కార్పొరేషన్ కు లేటర్ రాశాం.. గత మార్చ్ లో లెటర్ రాయగా.. వైసీపీ నేత ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తితో 200 కంప్లయిట్లు పెట్టించారు అని పేర్కొన్నారు. మీ కడుపు నొప్పికి వుడ్ వోర్డ్స్ కడుపు మంటకు జెల్సిల్ ఇవ్వాలా మీకు అని మంత్రి పయ్యావుల ప్రశ్నించారు.
Read Also: AP Cabinet: రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ!
అయితే, నేను అప్పట్లో రైజ్ చేసిన అంశాలపై సీఎస్ స్పందించారు.. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశం మొత్తం సర్కులర్ ఇచ్చారు అని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. జీవో నెంబర్ 22ను 11-3-2025న ఇచ్చాం.. జీవో నెంబర్ 35ను బుగ్గన ఇచ్చి 7 వేల కోట్ల రూపాయలు అడిగారని చెప్పుకొచ్చారు. మా మీద ఉన్న నమ్మకంతో రూ. 9 వేల కోట్లకు వెళ్లినా ఓవర్ సబ్ స్క్రైబ్ చేశారు.. ఇంత జరిగాక కూడా బుగ్గన ప్రెస్ మీట్ జగన్ ట్వీట్.. ఇంక ఆపండి అని సూచించారు. ఆర్బీఐ, సెబీ క్లియరెన్స్ ఇచ్చేసింది ఇంకా ఎందుకు మీ ఏడుపులు అని పయ్యావుల కేశవ్ మండిపడ్డారు.