Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలోని K కన్వెన్షన్ లో వైసీపీ బాబు షూరిటీ- మోసం గ్యారంటీ కార్యక్రమం ప్రారంభం అయింది. ఈ సమావేశానికి భారీగా వైసీపీ కార్యకర్తలు హాజరయ్యారు. ఇక, అనారోగ్య కారణాల వల్ల ఈ మీటింగ్ కు దూమాజీ మంత్రి కొడాలి నాని, ఆయన అనుచరులు దూరంగా ఉన్నారు. అనారోగ్యంతోనే గుడివాడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో సంతకం చేసిన వెంటనే హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇక, జిల్లా అధ్యక్షుడు పేర్నినాని అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఇంకా K కన్వెన్షన్ కు పేర్ని నాని, వైసీపీ ముఖ్యనాయకులు చేరుకోలేదు.. పేర్ని నాని సహా ముఖ్య నాయకులు K కన్వెన్షన్ కు చేరుకుంటారా లేదా అనే డైలమా కొనసాగుతుంది.
Read Also: Andhra Premier League: క్రికెట్ లవర్స్ కు పండగే.. సాగరతీరం విశాఖలో మరో సందడి
అయితే, K కన్వెన్షన్ కు వచ్చే దారిలో కిలో మీటర్ దూరంలో రోడ్లపైకి టీడీపీ కార్యకర్తలు వచ్చారు. మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. నాగవరప్పాడు జంక్షన్ నుంచి K కన్వెన్షన్ కి వెళ్లేందుకు వైసీపీ నేతలకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. గుడివాడ అసెంబ్లీ బాధ్యతలను ప్రస్తుతం చూస్తున్న శశిభూషణ్ ఆధ్వర్యంలో సమావేశం కొనసాగుతుంది.