Gudivada Tension: కృష్ణా జిల్లా గుడివాడలో వైసీపీ, కూటమి పోటాపోటీ కార్యక్రమాలతో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. నాగవారప్పాడు జంక్షన్ నుంచి K కన్వెన్షన్ సెంటర్ వైపు వైసీపీ కార్యకర్తలు వెళ్లకుండా టీడీపీ కార్యకర్తలు ఆడుకుంటున్నారు. ఇప్పటికే, మాజీ మంత్రి పేర్నినాని సహా ముఖ్య నాయకులను మచిలీపట్నంలో పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో మచిలీపట్నంలోని పేర్ని నాని నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక, ముఖ్య నాయకులు లేకుండానే బాబూ ష్యూరిటీ- మోసం గ్యారెంటీ కార్యక్రమం కొనసాగుతుంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్న వైసీపీ పెడన ఇంచార్జ్ రాము అడ్డుకోగా.. జడ్పీ చైర్మన్ ఉప్పల హారిక కారు ధ్వంసం చేశారు. కారును ముందుకు కదలనివ్వకుండా అడ్డుకున్నారు టీడీపీ- జనసేన పార్టీలకు చెందిన శ్రేణులు. విషయం తెలుసుకున్న వైసీపీ కార్యకర్తలు కే కన్వెన్షన్ నుంచి ముఖ్య నాయకులు ఉన్న ప్రాంతానికి వెళ్తున్నారు.
Read Also: Blackmailing: మహారాష్ట్ర కానిస్టేబుల్ యవ్వారం మామూలుగా లేదుగా..
మరోవైపు, K కన్వెన్షన్ వైపుకు వెళ్లేందుకు టీడీపీ కార్యకర్తలు దూసుకొస్తున్నారు. అప్రమత్తమైన పోలీసులు.. K కన్వెన్షన్ వైపుకు టీడీపీ కార్యకర్తలు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులకు టీడీపీ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ లో పోలీసులు ఉన్నారు. టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి చెందిన కార్యకర్తలు రోడ్డెక్కారు. దీంతో పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే కూర్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు.