Dharmana Prasada Rao: చంద్రబాబు మ్యానిఫేస్టో అమలు చేయడని మన అందరికి తెలుసు అని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు విమర్శించారు. ఆ విషయం కార్యకర్తలు ప్రజలకు చెప్పాలి.. ప్రతిపక్షంలో ఉన్నవారు.. ప్రజలకు లోపాలను ఎత్తి చూపడానికి ప్రయత్నించాలి.. పాతది చేశామని చెప్పోద్దు.. మనం ప్రతిపక్షంలో ఉన్నాం.. రూలింగ్ లో ఉన్న వారి మోసాలను ప్రజలకు తెలియజేయాలని సూచించారు. ఒక సంవత్సరంలో 2 లక్షల కోట్ల బడ్జెట్ లో వెయ్యి కోట్లు శ్రీకాకుళం జిల్లాకి క్యాపిటల్ కేటాయించలేదు.. కూటమిలో మిగతా వారు ఎవరూ లేరు.. చంద్రబాబు పాపం మిగతా వారి మీద వేస్తున్నాడంతే అని ఎద్దేవా చేశారు. పవన్ ఇన్ సెక్యూరిటితో ఉన్నారు.. ఆయన అమాయకుడు, కేవలం చంద్రబాబుని పోగడటానికే పరిమితం అని ధర్మాన ప్రసాదరావు చెప్పుకొచ్చారు.
Read Also: Tollywood: డబ్బు ఇవ్వకపోతే నెగటివ్ రివ్యూలు.. యూట్యూబర్ పై నిర్మాత పోలీస్ కంప్లైంట్
ఇక, ఏపీలో కూటమి ఏం లేదు… ఓన్లీ టీడీపీనే కనిపిస్తుందని ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. మన శత్రువు ఓన్లీ టీడీపీనే.. మహిళలే చాకచక్యంగా ఉన్నారు.. వారే ప్రభుత్వాన్ని మార్చగలరు.. మహిళలను చైతన్య పరచాలి.. సోషల్ మీడియానే ఆయుదంగా చేసుకోవాలని సూచించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు పరిస్థితి దారుణంగా ఉంది.. ఏంతో న్యాయంగా నియమించాం.. ఇప్పుడు బదిలీలలో వారికి అన్యాయం చేసారు.. లంచం ఇస్తేనే మంచి ప్లేస్ ఇస్తున్నారు.. వాలంటీర్లకు దారుణంగా అన్యాయం చేశారు.. వచ్చే ఎన్నికల్లో గెలుపు మనదే.. అప్పటి వరకు ప్రజలను చైతన్య పరచాలన్నారు. నేను కొంతకాలం ప్రశాంతంగా ఉన్నాను.. నేను రావడం లేదని మీరు కార్యక్రమాలు ఆపోద్దు.. నేను పనిచేయ లేకపోతే వేరే వారిని పెడతాం.. నేను రాజ్యసభకో, పార్లమెంట్ కో వెళ్లిపోతా.. లేదంటే కార్యకర్తగా తిరుగుతాను అన్నారు.. ఇక, నేను బీజేపీ, జనసేన, టీడీపీలోకి పోతున్నాని బుద్ధిలేని వారు ప్రచారం చేస్తున్నారు.. ఎందుకు ఇతర పార్టీల్లోకి వెళతాను అని ధర్మాన ప్రసాదరావు ప్రశ్నించారు.