CM Chandrababu: ఏపీ రాజధాని అమరావతిలో ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల నిర్మాణాలపై సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. రాజధానిలో వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటళ్లు, కార్యాలయాలు, వివిధ ప్రాజెక్టుల కోసం కేటాయించిన స్థలాల్లో ప్రస్తుత పరిస్థితిపై చర్చ. సమీక్షకు ఆయా సంస్థల అధినేతలు, ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.
Minister Payyavula: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజలు, ఖజానాపై మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బాగా ప్రేమ చూపిస్తున్నారు అని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు.
Minister Savitha: భారతదేశ మహిళలను ఇతర దేశాలలో కూడా గౌరవిస్తారు అని కడప జిల్లా ఇంఛార్జ్ మంత్రి సవిత సవిత తెలిపారు. కానీ, మహిళా రైతులు అమరావతి నుంచి తిరుపతికి పాదయాత్రగా వెళ్లినప్పుడు ఎలా అసభ్యకరంగా మాట్లాడారో అందరికీ తెలుసు అని పేర్కొన్నారు.
Perni Nani: కృష్ణజిల్లా మచిలీపట్నంలో పర్యటించిన వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్నినాని మాట్లాడుతూ.. చంద్రబాబుపై ఘాటు విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ కారులో ప్రయాణిస్తే నాపై కేసు నమోదు చేశారని ఆరోపించారు.
Free Bus In AP: శ్రీశైలంలో పర్యటించిన సీఎం చంద్రబాబు.. సున్నిపెంటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళలు అందరికీ ఆగస్టు 15వ తేదీ నుంచి ఫ్రీ బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని అన్నారు.
కృష్ణ, గోదావరి, పెన్నా , వంశధార నదులు ఉన్నాయి.. కృష్ణా నదికి నీళ్లు రాకపోయినా.. గోదావరి నుంచి బనకచర్ల ప్రాజెక్టుకు నీరు తెస్తే కరువు ఉండదు అని తేల్చి చెప్పారు. గోదావరి-బనకచర్ల నా సంకల్పం.. 554 టీఎంసీల నీళ్లు ఇప్పుడు నిలువ ఉన్నాయి.. రాబోయే రోజుల్లో 450 టీఎంసీల నీళ్లు వస్తే అన్ని జలాశయాలు కలకళలాడుతాయని చంద్రబాబు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై ప్రసన్నకుమార్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్గా స్పందించారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. ఈ వ్యాఖ్యలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్న ఆయన.. మహిళల వ్యక్తిత్వాన్ని అవహేళన చేస్తూ కించపరచే వ్యాఖ్యలు చేయడం వైసీపీ నాయకులకు ఒక అలవాటుగా మారిపోయిందని మండిపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడికి తనకి ఎలాంటి సంబంధం లేదని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి స్పష్టం చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. తన క్యారెక్టర్ గురించి మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారు.. ఇప్పటికి ఎన్నోసార్లు తన క్యారెక్టర్ పై తీవ్రమైన విమర్శలు చేసినా.. నేనెక్కడా సహనం కోల్పోలేదన్నారు.. తనపై వ్యక్తిగత విమర్శలు వేసిన ప్రసన్న కుమార్ రెడ్డిపై మహిళా కమిషన్ కి…
EX MLA Prasanna Kumar Reddy: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్ లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్ తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.
గంటా శ్రీనివాసరావు....తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అవసరంలేని నాయకుడు. ఆయన పొలిటికల్ సక్సెస్ల సంగతి ఎలా ఉన్నా... ఏ ఎండకు ఆ గొడుగు పట్టేస్తారని మాత్రం గట్టిగా చెప్పుకుంటుంటాయి రాజకీయ వర్గాలు.