High tension in Gudivada: కృష్ణా జిల్లా గుడివాడలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. మరికాసేపట్లో గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం జరగనుంది. ఈ సభకు మాజీ మంత్రి పేర్ని నాని ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. గత రెండు రోజులుగా పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలపై టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో గుడివాడలోని ప్రధాన ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. ప్రత్యేకించి నాగవరప్పాడు జంక్షన్ దగ్గర ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ ఫ్లెక్సీని టీడీపీ శ్రేణులు చించివేయడం తీవ్ర కలకలం రేపుతుంది. ఫ్లెక్సీ చించకుండా అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు.
Read Also: Pawan Kalyan : ఛీ..ఛీ.. అంటూ పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. జనసేన కౌంటర్..
అయితే, గుడివాడ నెహ్రూ చౌక్ వద్ద టీడీపీకి చెందిన మరో వివాదాస్పద ఫ్లెక్సీని వైసీపీ ఏర్పాటు చేసింది. ఇందులో సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు మాజీ మంత్రి కొడాలి నాని ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. కుప్పంలో చంద్రబాబు గెలిస్తే బూట్ పాలిష్ చేసి కాళ్ల దగ్గర ఉంటానని సవాల్ చేశారు. ఇప్పుడు ఆ సవాల్‌ను గుర్తు చేస్తూ టీడీపీ కార్యకర్తల తరఫున మరో ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు.
Read Also: Shubman Gill: శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర.. టీమిండియా తొలి కెప్టెన్‌గా..!
మరోవైపు, వైసీపీ కార్యక్రమానికి హాజరుకావాల్సిన కొడాలి నాని అనారోగ్య కారణాలతో దూరంగా ఉన్నారు. కానీ, అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా గుడివాడ వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు హాజరై, సంతకం చేసిన వెంటనే హైదరాబాద్‌కు బయలుదేరినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో గుడివాడ K కన్వెన్షన్ సెంటర్ దగ్గరకు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరుకుని.. జై రాము, జై టీడీపీ అంటూ నినాదాలు చేస్తూ.. టీడీపీ ఎమ్మెల్యే రాము ఫోటోకి పాలాభిషేకం చేశారు. ఈ పరిణామాలతో గుడివాడలో హై టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.