Perni Nani: కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ- వైసీపీ పోటా పోటీ సభలు పెట్టడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో మచిలీపట్నంలో మాజీ మంత్రి పేర్ని నానిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పేర్నినాని మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డారు. స్థానిక జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారిక మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం.. వినలేని విధంగా జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పల హారికను పచ్చి బూతులు తిట్టారని పేర్కొన్నారు. హారికకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు కారు దిగమని ఒత్తిడి చేశారు.. కారు నుంచి కిందకు దింపి చంపేయాలి అనుకున్నారా అని ప్రశ్నించారు. గుడివాడలో పోలీసులు ఘోరంగా పని చేస్తున్నారు.. పోలీసులు అంటే ధైర్యం ఇవ్వాలి కానీ చంపేయడానికి రౌడీ మూకలకు అండగా ఉంటె ఎవరికి చెప్పుకోవాలని పేర్నినాని అడిగారు.
Read Also: Wine Shops: మందు బాబులకు అలర్ట్.. రెండ్రోజుల పాటు వైన్స్ బంద్
అయితే, ఆడవాళ్ళ మీద దాడి చేయడం అంటే సైకో పరిపాలన కాదా అని మాజీమంత్రి పేర్నినాని క్వశ్చన్ చేశారు. ఉప్పల హారిక మీద దాడి చేసి, గాయపర్చిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పల హారికను హత్యాయత్నం చేసి తీవ్ర భయబ్రాంతులకు గురి చేశారని ఆరోపించారు. ఆమె కారుపై దాడి జరుగుతుంటే అక్కడే ఉన్న పోలీసులు ఏం చేస్తున్నారు అని ప్రశ్నించారు. ఇక, కొడాలి నాని చెక్ అప్ షెడ్యూల్ ఉంది అందుకే పోలీస్ స్టేషన్ లో సంతకం చేసి హైదరాబాద్ కు వెళ్లారు.. కే కన్వెన్షన్ లో జరిగే మీటింగ్ కు నాతో సహా స్థానిక ఇంచార్జీలు అంత గుడివాడ వెళ్ళాల్సి ఉండగా.. లా అండ్ ఆర్డర్ పరిస్థితులు సరిగ్గా లేవని పోలీసులు మమ్మల్ని అడ్డుకున్నారని పేర్నినాని చెప్పుకొచ్చారు.