Sajjala Ramakrishna Reddy: సర్పంచ్ నాగమల్లేశ్వరావు కోలుకుంటారని ఆశిస్తున్నాను అని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. దుర్మార్గంగా దాడి చేశారు.. మృత్యుంజయుడిగా బయట కొస్తాడని భావిస్తున్నాను.. ఇది రాజకీయపరమైన హత్యాయత్నం.. సీసీ కెమెరా విజువల్స్ భయానకరంగా ఉన్నాయి.. అంబటి మురళి పైనే కేసు నమోదు చేశారు.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం అవుతుంది.. రెచ్చగొట్టిన ధూళిపాళ్లపై కేసు పెట్టలేదు అని మండిపడ్డారు. రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తుంది.. వైసీపీ నేతల పైనే దాడులు చేయమని నేరుగా చెబుతున్నారు.. నెల్లూరులో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేస్తున్నా పోలీసులు పట్టించుకోలేదు అని సజ్జల ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: KOTA : కోటశ్రీనివాసరావు కోసం కదలివచ్చిన జనసేనాని
ఇక, గుడివాడలో దాడిలో పోలీసులు అక్కడే ఉన్న జెడ్పీ ఛైర్ పర్సన్ ఉప్పాల హారికపై దాడిని అడ్డుకోలేదు అని వైసీపీ నేత సజ్జల మండిపడ్డారు. ప్రజాస్వామ్యయుతమైన హక్కులను వైసీపీ నేతల్ని వినియోగించుకోనివ్వడం లేదు.. జగన్ మోహన్ రెడ్డి ఇప్పటి వరకూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయలేదు.. జగన్ పర్యటనకు వచ్చినప్పుడల్లా వందల్లో కేసులు నమోదు చేస్తున్నారు.. మామిడి యార్డు మూసివేశారు.. చంద్రబాబు ఆధ్వర్యంలో పోలీసు రాజ్యం నడుస్తుందని ఆరోపించారు. ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సింది ప్రజలే.. అందుకే ప్రజలకు చెబుతున్నాం.. చంద్రబాబు దుర్మార్గంగా అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు.. మానసికంగా వేధిస్తున్నారు.. ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తే జగన్ ఎందుకు బయటకొస్తారని సజ్జల ప్రశ్నించారు.