Perni Nani: కృష్ణా జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పామర్రులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి తప్ప రప్పా రప్పా అని అనటం కాదన్నారు. రప్పా రప్పా అనేది మెయిన్ కాదని.. అది చీకట్లో జరిగిపోవాలన్నారు. నాని కామెంట్స్ పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా మండిపడ్డారు. ఈ నేపథ్యంలో పేర్ని నానిపై పోలీసులు కేసు నమోదు చేసే అవకాశం ఉంది. పామర్రు పోలీస్ స్టేషన్ కు ఇప్పటికే జిల్లా ఎస్పీ గంగాధర్ చేరుకున్నారు. మచిలీపట్నం లేదా పామర్రు పోలీస్ స్టేషన్ లో పేర్ని నానిపై కేసు నమోదు చేయనున్నారు.
Read Also: Sridhar Babu: తెలంగాణ నుంచి తక్కువ మంది సినీ యాక్టర్స్.. ప్రభుత్వం కీలక నిర్ణయం..
అయితే, పేర్ని నాని వ్యాఖ్యలపై ఆర్ పేట పోలీసులకు ఇప్పటికే టీడీపీ నేతలు ఫిర్యాదు చేశారు. పామర్రులో నాని చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదుకు జిల్లా ఎస్పీ గంగాధర్ ఆదేశాలు ఇవ్వనున్నారు. మరోవైపు, జడ్పీ చైర్ పర్సన్ ఉప్పాల హారిక కారు ధ్వంసంపై కూడా గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. కారు ధ్వంసంపై ఇప్పటికే పోలీసులకి ఉప్పాల హారిక, ఆమె భర్త రాము ఫిర్యాదు చేశారు.