Gudivada Tension: కృష్ణా జిల్లాలోని గుడివాడ కే కన్వెన్షన్ లో జరుగుతున్న వైసీపీ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లిన జెడ్పీ ఛైర్మన్ ఉప్పాల హారికతో పాటు వైసీపీ ఇంచార్జ్ ఉప్పాల రామును అదుపులోకి తీసుకుని పట్టణంలోని వన్ టౌన్ స్టేషన్ కు పోలీసులు తరలించారు. నాగవరప్పాడు సెంటర్లో జడ్పీ చైర్మన్ దంపతులను టీడీపీ శ్రేణులు అడ్డుకుని.. కారు అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో సుమారు గంటకు పైగా కారులోనే ఉప్పాల హారిక దంపతులు ఉండిపోయారు. ఇక, జడ్పీ చైర్మన్ హారికపై కొందరు ఆకతాయిలు అసభ్య పదజాలంతో దుర్భాషలాడారు. ఇక, ఆగ్రహంతో ఊగిపోతూ కారులో నుంచి దిగే ప్రయత్నం చేశాడు ఆమె భర్త రాము.
Read Also: High Budget Movies:హద్దులు దాటుతున్న పద్దులు.. వాటికే సగం బడ్జెట్?
ఇక, పోలీస్ బందోబస్తు మధ్య జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక దంపతులను పీఎస్ కు తరలించారు పోలీసులు. ఇక, స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జడ్పీ చైర్మన్ హారిక కన్నీటి పర్యంతమైంది. మహిళ అని కూడా చూడకుండా తనను దుర్భాషలాడారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. సభ్య సమాజం తలదించుకునేలా గుడివాడలో టీడీపీ కార్యకర్తలు వ్యవహరించారంటూ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు పెడన వైసీపీ ఇంచార్జ్ ఉప్పాల రాము.