రాజమండ్రి రూరల్ నుండి టీడీపీ ( TDP ) అభ్యర్థిగా నేనే పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. ఇక, నిడదవోలు నుంచి జనసేన అభ్యర్థిగా కందులు దుర్గేష్ పోటీ చేస్తారని వెల్లడించారు.
బీసీలపై దాడులు జరిగితే మా ప్రాణాలు అడ్డు వేస్తాం అని ప్రకటించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సీఎం జగన్ చేస్తున్న అక్రమాలపై వైసీపీలోని బీసీ నేతలు ఆలోచించాలని సూచించారు.. బీసీలకు జగన్ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించకుంటే బీసీ కులాలకు అన్యాయం చేసినట్టేనని వైసీపీ బీసీ నేతలు ఆలోచించాలని హితవుపలికారు.. బీసీలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి రావాలని ఆకాక్షించారు.. బీసీల కోసం ఏడాదికి రూ. 75 వేల కోట్లు కేటాయిస్తామన్నారు.. కానీ, అది సున్నా..…
మంత్రి పదవితో పాటు అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన గుమ్మనూరు జయరాం.. ఈ రోజు తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ హాజరైన జయహో బీసీ సభకు హాజరైన ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు.. ఇక, టీడీపీలో చేరినందుకు ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు జయరాం.. గతంలో టీడీపీలో పని చేశాను.. మళ్లీ టీడీపీలో చేరినందుకు సంతోషంగా ఉందన్నారు..
ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రేపు మంగళగిరిలో టీడీపీ 'జయహో బీసీ' బహిరంగ సభను పెద్ద ఎత్తున నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. బహిరంగ సభలో టీడీపీ- జనసేన కూటమి బీసీ డిక్లరేషన్ ప్రకటించనుంది.
Is TDP-Janasena Waiting for BJP’s Call: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాల్సిందేనని టీడీపీ-జనసేన పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఇందుకోసం ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా.. దానిని సువర్ణావకాశంగా మలుచుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముందుకు వెళుతున్నారు. గెలుపే లక్ష్యంగా దూసుకెళుతున్న టీడీపీ-జనసేన పార్టీలు తమ అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించాయి. రెండో జాబితా ఇంకా విడుదల చేయాల్సి ఉంది.…
తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ సీఎం జగన్‌ను తొక్కడం కాదు.. పవన్ కల్యాణ్‌ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు.
జనసేన - టీడీపీ ఒప్పందం అయిన తర్వాత జరిగిన మొదటి ఉమ్మడి సభ తాడేపల్లిగూడెం జెండా సభ అని.. తాడేపల్లిగూడెం సభతో అసలు ఏం సందేశం ఇచ్చారని.. జెండా సభకు జనాలు రాకపోవటంతో ఆలస్యంగా మొదలుపెట్టారని ప్రతిపక్ష కూటమిని ఉద్దేశించి మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు.