TDP: త్వరలోనే టీడీపీ రెండో విడత అభ్యర్థుల జాబితా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోసం తెలుగుదేశం – జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. ఎన్నికల్లో గెలుపు గుర్రాల బరిలోకి దింపడం ద్వారా విజయం సాధించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా అనేకసార్లు ఇరుపార్టీలు అధినేతలు సమావేశమై అభ్యర్థులు ఎంపికపై కసరత్తు పూర్తి చేశారు. త్వరలోనే రెండో విడత అభ్యర్థుల జాబితాను టీడీపీ విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే 99 మంది అభ్యర్థులతో టీడీపీ మొదటి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. పోటీ చేసే కొన్ని స్థానాల్లో ఏ పార్టీ పోటీ చేయాలనే స్పష్టతకు కూటమి పార్టీలు రావాల్సి ఉంది. ఈ స్పష్టత రాగానే టీడీపీ రెండో విడత జాబితాను విడుదల చేయనుంది. పి.గన్నవరం, కైకలూరు, తాడేపల్లి గూడెం, పెందుర్తి, కాకినాడ అర్బన్, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, మదనపల్లె, కదిరి, కాళహస్తి వంటి స్థానాల్లో ఎవరు పోటీ చేయాలనే అంశంపై తర్జన భర్జన పడుతున్నట్లు తెలుస్తోంది.
Read Also: Mudragada Padmanabham: ఈ నెల 14న వైసీపీలో చేరనున్న ముద్రగడ పద్మనాభం
Also Read
- Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
సోము వీర్రాజు కోసం రాజమండ్రి అర్బన్ పై టీడీపీ పునరాలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రాజమండ్రి అర్బన్ స్థానాన్ని ఆదిరెడ్డి వాసుకు టీడీపీ ఖరారు చేసింది. పలు ఎంపీ స్థానాల పైనా స్పష్టత రావాల్సి ఉందని కూటమి పార్టీలు పేర్కొంటున్నాయి. రేపు లేదా ఎల్లుండి చంద్రబాబు, పవన్‌తో బీజేపీ జాతీయ సహ సంఘటనా కార్యదర్శి శివ ప్రకాష్ విడివిడిగా భేటీ కానున్నట్లు సమాచారం. శివ ప్రకాష్ భేటీ తర్వాత రెండో విడత అభ్యర్థుల జాబితా విడుదలపై క్లారిటీ రానుంది. రెండో విడత జాబితాలో కొన్ని ఎంపీ స్థానాలకూ అభ్యర్థులను టీడీపీ అధినేత చంద్రబాబు. ప్రకటించనున్నారు. అటు జనసేన కూడా అభ్యర్థులను ఖరారు చేసే విషయంలో నిమగ్నమై ఉంది. పవన్ కల్యాణ్ ఎక్కడి నుంచే పోటీ చేస్తారోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి పోటి చేయనున్నారు. ఈ నియోజకవర్గంలో కాపులు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో పవన్ ఈ స్థానాన్ని ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. శనివారం మలి విడతగా కేంద్రమంత్రి అమిత్ షా , టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, జనసేన నేత పవన్‌కల్యాణ్ మధ్య జరిగిన చర్చలు కొలికివచ్చాయి.ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలో అన్న అంశంపై క్లారిటీ కూడా వచ్చినట్లు సమాచారం. అయితే అంతకుముందు ఎంపీగా, ఎమ్మెల్యేగా రెండు స్థానాల నుంచి పోటీ చేయాలని ఆసక్తి చూపిన పవన్ బీజేపీ పెద్దల సూచనతో ఆ ఆలోచనను విరమించుకున్నట్లు తెలిసింది.
తాజావార్తలు
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..
-
Trump vs Zelenskyy: జెలెన్స్కీపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలంటూ సూచన!
-
PM Modi Chennai Visit Today: నేడు చెన్నైలో ప్రధాని మోడీ పర్యటన.. రూ.13,000 కోట్ల ప్రాజెక్టులకు శ్రీకారం!
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!