ఉదయగిరి నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఈనెల 22వ తేదీన అట్టహాసంగా భారీ జన సందోహం నడుమ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అదే విధంగా బుధవారం నాడు మధ్యాహ్నం సుమారు 3 గంటల సమయంలో ఉదయగిరిలోని తహసిల్దార్ కార్యాలయంలో కాకర్ల సురేష్ రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. కాకర్ల సురేష్ వెంట ఆయన సతీమణి కాకర్ల ప్రణీత ఉదయగిరి మండల కన్వీనర్ బయన్న ఇతర నాయకులు ఉన్నారు.
Read Also: Priyanka Gandhi : జైలుకు వెళ్లకుండా ఉండేందుకు కేరళ సీఎం బీజేపీతో రాజీపడ్డారు : ప్రియాంక గాంధీ
అలాగే, వింజమూరులోని కాకర్ల ట్రస్ట్ కార్యాలయంలో గణేశ్వరపురం వాసులు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం- జనసేన- బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ను కలిశారు. శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. ఈ సందర్భంగా కాకర్లు సురేస్ మాట్లాడుతూ.. తెలుగుదేశం విజయానికి కష్టపడి పని చేయాలని మీ కష్టానికి గుర్తింపు ఉంటుందని వారికి భరోసాని ఇచ్చారు. ప్రతి ఒక్కడు ఒక సైనికులుగా పని చేయాలన్నారు. ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకుంటే నియోజకవర్గం అభివృద్ధి అవుతుందని తెలిపారు. సమిష్టి కృషితో తెలుగుదేశం పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కాకర్ల సురేష్ సూచించారు.
Read Also: Jagga Reddy: పార్టీలో చేరే వాళ్లు నేడు, రేపు గాంధీ భవన్ కు రావచ్చు.. జగ్గారెడ్డి సూచన
ఇక, ఉదయగిరి మండల కేంద్రంలోని కమసల వీధికి చెందిన 200 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారందరికీ సీనియర్ నాయకులు మాదాల రామచంద్రయ్య, షేక్ రియాజ్ లు కండువా కప్పి పార్టీలోనికి సాధారంగా ఆహ్వానించారు. ఇక, షేక్ రియాజ్ మాట్లాడుతూ.. ఉదయగిరి నియోజకవర్గ వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలను సొంత నిధులతో అందిస్తున్న కాకర్ల సురేష్ ను ఎమ్మెల్యేగా అదే విధంగా 150 మినరల్ వాటర్ ప్లాంట్ ను ఫ్లోరిడ్ ప్రాంతాలలో ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడుతున్న ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రానికి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే భవిష్యత్తు అన్నారు.