Off The Record: విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలో కూటమి పార్టీల కుమ్ములాటలు పతాకస్థాయికి చేరాయి. పొత్తు కింద నెల్లిమర్ల నియోజకవర్గం జనసేనకు కేటాయించినప్పటి నుంచి టీడీపీ స్థానిక నాయకుల్లో అసంతృప్తి అంతకంతకూ కొనసాగుతోందన్నది బహిరంగ రహస్యం. తొలి నుంచి ఈ నియోజకవర్గం టీడీపీ కంచుకోట. కానీ పట్టు లేని జనసేనకు కేటాయించడంపై నువ్వా నేనా అన్న తరహాలో వార్ సాగుతోంది. అధిష్టానం నుంచి అక్షింతలు పడుతున్నా వీరి తీరు మారలేదు. మళ్లీ వరద బాధితులకు నిత్యావసర…
Storyboard: ఏపీలో ఏడాదిన్నర పదవీకాలం పూర్తి చేసుకున్న కూటమి ప్రభుత్వానికి.. సొంతింట్లోనే సమస్యలు వస్తున్నాయి. ఎప్పటికప్పుడు కూటమిలో సమస్యలు రాకూడదని అటు చంద్రబాబు, ఇటు పవన్ మొత్తుకుంటున్నా.. రెండు పార్టీల నేతలు ఎవరి దారి వారిదే అన్నట్టుగా ఉంటున్నారు. కొన్ని వ్యవహారాలు మంత్రుల స్థాయిలోనూ వివాదాస్పదం కావడంతో.. మరికొన్నింటిపై ఏకంగా క్యాబినెట్లో చర్చ జరగటం.. కూటమికి ఇబ్బందికరంగా మారింది. అప్పటికీ అన్ని నియోజకవర్గాల్లో కూటమి సమన్వయ సమావేశాలు ఏర్పాటుచేశారు. అయినా సరే ఎక్కడికక్కడ టీడీపీ, జనసేన నేతలు…
ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొలిటికల్ ట్విస్టులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏపీటీఎఫ్ తరపున బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘు వర్మకు టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించాయి. రఘు వర్మకు ఓట్లేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశాయి. అయితే , కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది.
కాకినాడ జిల్లా పిఠాపురం అర్బన్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన మద్దతుతో విడివిడిగా పోటీకి దిగడంపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోకస్‌పెట్టారు.. రెండు పార్టీల నియోజకవర్గ నేతలను సమన్వయం చేయాలని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, మంత్రి నిమ్మల రామానాయుడుకి బాధ్యతలు అప్పగించారు..