Teachers MLC Elections: ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పొలిటికల్ ట్విస్టులు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. ఏపీటీఎఫ్ తరపున బరిలోకి దిగిన సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘు వర్మకు టీడీపీ, జనసేన మద్దతు ప్రకటించాయి. రఘు వర్మకు ఓట్లేసి గెలిపించాలని ఉపాధ్యాయులకు విజ్ఞప్తి చేశాయి. అయితే , కూటమిలో భాగస్వామిగా ఉన్న బీజేపీ ఆలోచన మాత్రం భిన్నంగా ఉంది. PRTU నుంచి పోటీలో ఉన్న మాజీ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడుకి ఇప్పటికే RSS మద్దతు ప్రకటించింది. శ్రీనివాసులు నాయుడు తరపున బీజేపీ నేత మాధవ్ సహా పలువురు ప్రచారంలో ఉన్నారు. ఈ నేపథ్యంలో కూటమి పార్టీలు ఉమ్మడిగా వ్యవహరించాల్సిన చోట వేరువేరు అభ్యర్థులకు మద్దతు ప్రకటించడం ఆసక్తికరంగా మారియింది.. అయితే, బీజేపీ కూడా కూటమి బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్.
Read Also: Anand Mahindra : టెస్లా ఇండియాలోకి ఎంట్రీ ఇవ్వడం పై ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే ?
మరోవైపు, ఆర్.ఎస్.ఎస్. నిర్ణయం మేరకు బీజేపీ నాయకత్వం ఇప్పటికీ శ్రీనివాసులు నాయుడు పక్షాన నిలిచింది. కూటమి పార్టీల మధ్య తొలిసారి ఇటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రలో రావడం ఇదే తొలిసారి. మొత్తంగా.. ఉపాధ్యాయ శాసనమండలికి జరుగుతున్న ఎన్నికలలో పోటీ చేస్తున్న పాకలపాటి రఘువర్మ కి కూటమి మద్దతు ఇస్తుందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.. ఇక, విశాఖ ఎంపీ శ్రీ భరత్ మాట్లాడుతూ ఉపాధ్యాయునిగా ఉన్నత సేవలు అందించి, ఉత్తరాంధ్ర సమస్యలు మీద పోరాటాలు చేసిన ఉపాధ్యాయ శాసనమండలి అభ్యర్థి రఘు వర్మకు మద్దతు ఇస్తున్నామని ప్రకటించారు.. పాకలపాటి రఘు వర్మ కు మద్దతు ఇస్తున్నట్టు ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు కూడా ప్రకటించారు. అనంత ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘు వర్మ మాట్లాడుతూ.. రాష్ట్ర కోసం అను నిత్యం కష్టపడే వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడు.. తనకు మద్దతు ఇవ్వటం ఎంతో సంతోషంగా ఉందన్నారు.. ఉత్తరాంధ్ర వెనుకబాటు తనాన్ని రూపు మాపాలనే లక్ష్యంతో ముందుకు వచ్చానని.. రెండు పర్యాయాలు శాసన మండలి సభ్యుడిగా ఉన్నానని.. మరో సారి అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని కోరారు..