TDP and Jana Sena: స్పీడ్ పెంచిన టీడీపీ-జనసేన.. మొదటివారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటన..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP and Jana Sena: ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో ఎన్నికల సన్నద్ధతను మరింత వేగవంతం చేయనున్నాయి తెలుగుదేశం పార్టీ-జనసేన పార్టీ.. వచ్చే నెల మొదటి వారంలో సీట్ల సర్దుబాటుపై ఉమ్మడి ప్రకటనకు అవకాశం ఉందని చెబుతున్నాయి ఇరు పార్టీల వర్గాలు.. ఇప్పటికే సీట్ల సర్దుబాటుపై రెండు దఫాలుగా టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మధ్య చర్చలు జరిగాయి.. త్వరలో మరోసారి చంద్రబాబు – పవన్ భేటీకి అవకాశం ఉందంటున్నారు.. ప్రస్తుతం హైదరాబాద్‌లో చంద్రబాబు – పవన్ కల్యాణ్ ఉన్నారు.. వచ్చే రెండు రోజులు సీట్ల సర్దుబాటు.. అభ్యర్థుల ఖరారు మీదే ఫోకస్ పెట్టనున్నారని తెలుస్తోంది.. సీట్ల సర్దుబాటు కసరత్తు నిమిత్తమే రా..! కదలి రా..!! సభలకు చంద్రబాబు బ్రేక్ ఇచ్చారనే చర్చ సాగుతోంది.. ఇప్పటికే 17 పార్లమెంట్ స్థానాల్లో రా..! కదలి రా..!! సభలు పూర్తి చేశారు.. వచ్చే నెల 4వ తేదీ మిగిలిన చోట్ల నుంచి రా..! కదలి రా..!! సభలు నిర్వహించేందుకు చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు..
Read Also: Vikarabad: రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నం.. రైలు- ప్లాట్ ఫారం మధ్యలో ఇరుక్కున్న ప్రయాణీకుడు..
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
మరోవైపు టీడీపీ-జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రకటన జరిగాకే తన పర్యటనలను జనసేనాని పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారట.. వచ్చే నెల 4వ తేదీన అనకాపల్లి నుంచి పవన్ కల్యాణ్ పర్యటనలు ప్రారంభం కానున్నట్టు ఇప్పటికే జనసేన సంకేతాలు ఇచ్చింది.. అయితే, సీట్ల సర్దుబాటుతో పాటు ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పనపైనా చంద్రబాబు – పవన్ కల్యాణ్ తుది కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.. కాగా, వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించిన టీడీపీ – జనసేన పార్టీలు.. ఇప్పటికే పలు అంశాలపై కీలకంగా చర్చించడం.. కొన్ని అంశాలపై ఉమ్మడి నిర్ణయానికి వచ్చిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!