కరోనా కాలంలో వివాహాలు విచిత్రంగా జరుగుతున్నాయి. కొంత మంది ఆన్లైన్ ద్వారా వివాహాలు చేసుకుంటే, మరికొందరు పరిమిత సంఖ్యతో వివాహాలు చేసుకుంటున్నారు. అయితే, తమిళనాడులోని మధురైకు చెందిన ఇద్దరు వ్యాపావేత్తల పిల్లల వివాహం విచిత్రంగా జరిగింది. మధురై నుంచి తుత్తుకూడి వరకు ఓ ప్రైవేట్ జెట్ విమానం బుక్ చేసుకున్నారు. అందులో మొత్తం 161 మంది అతిధులు బయలుదేరారు. మధురై నుంచి విమానం బయలుదేరగానే వధువు దక్షిణ మెడలో వరుడు రాకేష్ తాళి కట్టాడు. మధురై నుంచి…
తమిళనాడు కోయంబత్తూర్ ఆస్పత్రి ఆవరణలో పార్క్ చేసిన అంబులెన్స్ లో ఆక్సిజన్ సిలిండర్లు పేలుడు సంభవించింది. సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోవడంతో భారీగా పొగలు, మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో రోగులు, ఆసుపత్రి సిబ్బంది భయంతో పరుగులు తీశారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలార్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా, ఆక్సిజన్ సిలిండర్లు ఎలా పేలాయన్నదానిపై ఆస్పత్రి వర్గాలు విచారణ ప్రారంభించాయి.
కరోనా కట్టడిలోనై తన మార్క్ చూపిస్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్.. మాస్క్ ధరించడంపై స్వయంగా ఓ వీడియోను రూపొందించి విడుదల చేశారు.. ఇక, కోవిడ్ కట్టడిలో తామున్నామంటూ ప్రభుత్వానికి సహాయం చేస్తున్నారు సినీ తారలు, ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు.. తాజాగా, కోవై జిల్లా పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు ఏకుంగా రూ.32 కోట్ల విరాళాలు అందజేశారు. ఈ మేరకు తమిళనాడు సచివాలయం ప్రకటన విడుదల చేసింది.. పరిశ్రమల నగరం కోయంబత్తూర్ జిల్లాలో…
తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులో తిరుగులేని విజయాన్ని అందుకున్న డీఎంకే నేత స్టాలిన్.. సీఎంగా పగ్గాలు చేపట్టారు.. అప్పటి నుంచి పాలన విషయంలో తనదైన ముద్ర వేస్తున్నారు.. కోవిడ్‌పై డీఎంకే సర్కార్ చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఇప్పటికే పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు, పారిశ్రామిక వేత్తలు విరాళాలు ఇస్తున్నారు. మరోవైపు.. కోవిడ్‌పై పోరాటాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.. దీని కోసం తాజాగా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.. 13 మంది ఎమ్మెల్యేలతో ఒక సలహా మండలిని ఏర్పాటు…
తమిళనాడు ముఖ్యమంత్రిగా ఎంకె స్టాలిన్ ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణస్వీకారం చేసిన తరువాత మూడు ఫైల్స్ పై స్టాలిన్ సంతకం చేశారు. అందులో మొదటిది బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం, రేషన్ కార్డులు ఉన్న 2.07 కోట్ల కుటుంబాల కు రూ.4వేల రూపాయల చొప్పున సాయం అందించే ఫైల్ పై ముఖ్యమంత్రి స్టాలిన్ సంతకం చేశారు. ఇందులో మొదటి నెలలో రూ. 2 వేలరూపాయలు, తరువాత నెలలో రెండు వేల రూపాయలను జమ చేయనున్నారు. ఇక…
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాలో వెలుగుచూసిన ఎన్ 440 కె వేరియంట్ రాష్ట్రంలో వేగంగా విస్తరించింది. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవ్వడానికి ఈ వేరియంట్ కారణం అని అంటున్నారు. ఈ వేరియంట్ ఇప్పుడు ఏపీతో పాటుగా పొరుగురాష్ట్రాలైన కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఎన్ 440 కె వేరియంట్ అధికంగా విస్తరిస్తున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఈ వేరియంట్ వ్యాప్తి 15 శాతం వేగంగా విస్తరిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండాలని,…
తమిళనాడులో ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అయితే ఈ ఎన్నికలో కమల్ హాసన్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ మొత్తం 234 సీట్లలో పోస్టు చేస్తే మొదటి నుండి కేవలం పార్టీ అధినేత కమల్ హసన్ మాత్రమే ఆధిక్యంలో ఉన్నారు. కోయంబత్తూరు దక్షిణ నుండి పోటీ చేసిన కమల్ కు బీజో అభ్యర్థి వానతి శ్రీనివాసన్ మొదటి నుండి గట్టి పోటీ వోచారు. దాంతో రౌండ్ రౌండ్ కి మెజారిటీలు మారుతు వచ్చాయిల కానీ చివరకు కమల్ కు…
నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ్టితో ముగిసాయి.. అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే పోలింగ్ ముగిసిపోగా.. ఎప్పుడూ లేని విధంగా ఎనిమిది విడతలుగా పశ్చిమ బెంగాల్లో పోలింగ్ నిర్వహించింది ఎన్నికల కమిషన్.. ఇవాళ బెంగాల్లో చివరి విడత పోలింగ్ ముగియగానే.. ఎగ్జిట్ పోల్స్‌ను వెల్లడించాయి జాతీయ ఛానెల్స్.. అయితే, ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మోడీ, షా, బీజేపీ అగ్రనాయత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ బెడిసి కొట్టలా కనిపిస్తున్నాయి.. ఈ ఎన్నికల్లో…
భారత్‌లో కరోనా కల్లోలం కొనసాగుతూనే ఉంది.. పరిస్థితులను బట్టి ఆయా రాష్ట్రాలు కట్టడి చర్యలకు పూనుకుంటున్నాయి.. తాజాగా తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 20న అమలులోకి వచ్చిన నైట్‌కర్ఫ్యూ, ఇతర ఆంక్షలను మళ్లీ పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది.. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఆ ఆంక్షలు కొనసాగుతాయని పేర్కొంది ప్రభుత్వం.. ఇక, మే 2వ తేదీన రాష్ట్రవ్యాప్త లాక్డౌన్ అమలుచేయనున్నారు.. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరగగా.. మే 2న కౌంటింగ్ ప్రక్రియతో పాటు…