తమిళనాడులో కలకలం రేవుతుంది యువజంట పబ్జీ గేమ్ ప్లాన్. అసభ్య సంభాషణలను ‘అప్‌లోడ్’ చేసి మూడేళ్లలోనే 75 కోట్లు సంపాదించారు. మహిళలతో పబ్జీ ఆడుతూ, వారితో అసభ్యంగా మాట్లాడుతూ ఆ ఆడియోలను యూట్యూబ్‌లో అపలోడ్ చేయడం ద్వారా భారీగా సంపాదించారు ‘పబ్జీ మదన్’ దంపతులు. అయితే ఇప్పుడు మదన్ తో పాటు, ఆ ఛానల్ అడ్మిన్ అయిన భార్య కృతికను కూడా అరెస్టు చేసారు పోలీసులు. మూడేళ్లలోనే య్యూటుబ్ ద్వారా రూ.75 కోట్ల వరకు సంపాదించినట్లు తేలడంతో పోలీసులు సైతం షాక్ అయ్యారు. మదన్, అతని భార్య కృత్తిక బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.4 కోట్ల నగదును సీజ్ చేసారు సీబీసీఐడీ పోలీసులు. తమిళనాట సంచలనంగా మారిన ‘పబ్జీ మదన్’ లీలలపై పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు.
మదన్‌తో వ్యక్తిగతంగా జరిపిన సంభాషణ యూట్యూబ్‌లలో బహిర్గతం కావడంతో మరికోందరు మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేసారు. చెన్నైలోని వేంగైవాసల్‌కు చెందిన మదన్.. పబ్జీ గేమ్ ఆడుతూ, పలువురు మహిళలను కూడా దీనిలోకి గేమ్ అడుతూ వారి వద్ద అసభ్యంగా మాట్లాడుతూ.. ఆ సంభాషణలను రికార్డు చేసి సదరు మహిళలకు తెలియకుండా ఆడియోలను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్నాడు మదన్. సేలం ప్రాంతానికి చెందిన మదన్ కుమార్, అతని భార్య కృతిక.. మదన్
, టాక్సిక్ మదన్ 18+
, పబ్జీ మదన్ గర్ల్ ఫ్యాన్
అనే పేర్లతో యూట్యూబ్ చానల్స్ రన్ చేస్తున్నారు. వీరి ఛానెల్స్‌కు 8 లక్షలకు పైగా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. సంపన్నకుటుంబాలకు చెందిన చిన్న పిల్లలే అధికంగా టార్గెట్ చేస్తున్నారు ఈ జంట.