దేశంలో రోజురోజుకు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక చోట్ల లీటర్ పెట్రోల్ ధర రూ. 100 దాటింది. చెన్నైలో రూ.98.88 ఉండగా, ఆ రాష్ట్రంలోని 10 జిల్లాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ.100 దాటింది. కడలూరు, ధర్మపురి, కల్లకుర్చి, కృష్ణగిరి, నాగపట్నం,నీలగిరి, తిరువత్తూరు, తిరువణ్ణామలై, వేలూరు, విల్లుపురం జిల్లాల్లో లీటర్ పెట్రోల్ వంద రూపాయలు పలుకుతున్నది.
Read: తెలకపల్లి రవి: ఐదు కోర్కెలతో అఖిలపక్షం, బీజేపీ వ్యూహాత్మక రహస్యం
ఇప్పటికే పెట్రోల్ ధరలు వంద కావడం, రాబోయో రోజుల్లో మరింతగా ఈ ధరలు పెరుగుతాయని వార్తలు వస్తున్న నేపథ్యంలో వాహనదారులు అందోళనలు చేస్తున్నారు. ఎన్నికల సమయంలో డిఎంకె పార్టీ పెట్రోల్ ధరలను తగ్గిస్తామని హామీ ఇచ్చింది. మరి ఈ హామీని ప్రభుత్వం అమలు చేస్తుందా.