తను ఇచ్చిన ఆర్డర్‌లో నచ్చిన ఐటం రాకపోవడంతో మొదలైన గొడవ.. చివరకు హోటల్ యజమానిపై దాడి, హోటల్ ధ్వంసానికి దారి తీసింది.. ఈ ఘటన తమిళనాడులోని అంబూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుపత్తూర్ జిల్లాలోని అంబూర్‌లో మొహమ్మద్ సర్ధార్‌కి చెందిన స్టార్ బిర్యానీ సెంటర్ ఉంది… ఆ హోటల్‌కు వెళ్లిన అన్నాడీఎంకే, కాంగ్రెస్ నేతలు… భోజనం ఆర్డర్ ఇచ్చారు.. అయితే, అందులో రావాల్సిన సేమియా ఫ్రై రాలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నాడీఎంకే, కాంగ్రెస్ నేతలు… హోటల్ యజమానితో గొడవదిగారు.. వారిని ప్రతిఘటించడానికి అతను ప్రయత్నించినా… ఇద్దరు, ముగ్గురు, నలుగురు ఇలా.. దాడికి దిగి యజమానిని చితకబాదడమే కాకుండా హోటల్‌ని ధ్వంసం చేశారు స్థానిక నేతలు ప్రభు, దయాలన్, అతని మిత్రులు… ఈ వ్యవహారం మొత్తం ఆ హోటల్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది… ఈ ఘటనపై కేసు నమోదు చేసిన అంబూర్ పోలీసులు… సీసీ టీవీ విజువల్స్ ఆధారంగా విచారణ చేపట్టారు.