చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి మన దేశంలోని అన్ని రాష్ట్రాలలో విలయం సృష్టిస్తోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్న సంగతి తెలిసిందే. కరోనా మహమ్మారితో ఇప్పటికే ఆ రాష్ట్రంలో లాక్డౌన్ కొనసాగుతోంది. లాక్డౌన్ కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయి. మహమ్మారి ఉదృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. పైగా థర్డ్ వేవ్ పొంచి ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 12 వ తరగతి పరీక్షలను…
ఇంకా అనుకున్న స్థాయిలో కరోనా కేసులు అదుపులోకి రాకపోవడంతో తమిళనాడులో మళ్లీ లాక్‌డౌన్‌ను పొడిగించింది ప్రభుత్వం.. ఇప్పటి వరకు లాక్డౌన్ ఆంక్షలు ఈ నెల 7వ తేదీ వరకు అమల్లో ఉండగా.. జూన్ 14 ఉదయం 6 గంటల వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తున్నట్టు సీఎం ఎంకే స్టాలిన్ ప్రకించారు.. అయితే, పాజిటివ్ కేసుల ఆధారంగా.. ప్రాంతాల వారీగా సడలింపులు ఇచ్చింది సర్కార్.. కోవిడ్ కేసులు తగ్గిన చెన్నై, ఉత్తర మరియు దక్షిణ తమిళనాడు జిల్లాలకు ఎక్కువ సడలింపులు…
ప్రియుడి బలవన్మరణాన్ని తట్టుకోలేక.. ప్రియురాలు ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన తమిళనాడులోని కరూర్ జిల్లాలో జరిగింది. కామరాజ నగర్‌లోని ఆశిక్ (19) తన ఊరిలోనే ఓ అమ్మాయిని (17) ప్రేమించాడు. ఈ క్రమంలో ఇద్దరు ప్రేమికుల మధ్య చిన్నపాటి మనస్పర్థలు వచ్చాయి. దీంతో యువతి ఆశిక్‌తో మాట్లాడటానికి నిరాకరించింది. మనోవేదనకు గురైన ఆశిక్.. ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడి మరణంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి సైతం బలవన్మరణానికి పాల్పడింది.
తమిళనాడులో కరోనాతో సింహం మృతిపై విచారణకు ఆదేశించారు అధికారులు. వండలూర్ అరిగ్నార్ అన్నా జూలాజికల్ పార్క్ లో ఈ ఘటన చోటు చేసుకున్న విషయం తెలిసిందే. నీలా అనే తొమ్మిది సంవత్సరాల ఆడ సింహం కరోనాతో మృతి చెందింది. మొత్తం 11 సింహాలలో 9 సింహాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. కానీ లాక్ డౌన్ కారణంగా గత నెల రోజుల జూ మూసి ఉంది. జూ సిబ్బంది మొత్తం వ్యాక్సినేషను వేసుకున్నావరే… ఎవరికి కరోనా సోకలేదు… మరి…
కరోనాకు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. అయితే, ఓవైపు వ్యాక్సిన్ల కొరత కొన్ని రాష్ట్రాలను వేధిస్తున్నా.. మరోవైపు.. ఇప్పటికీ వ్యాక్సిన్ అంటే అవగాహనలేక భయపడిపోయేవారు కూడా ఉన్నారు.. దీంతో.. కొన్ని సంస్థలు వినూత్న రీతిలో అవగాహన కల్పించేందుకు పూనుకుంటున్నాయి.. వ్యాక్సిన్ వేసుకొండి.. ఈ గిఫ్ట్‌లు గెలుచుకోండి అంటూ ప్రచారం చేస్తున్నాయి.. ఇక, తమిళనాడులోని చెంగల్ పట్టు జిల్లా కోవలంలో ఎస్ టీఎస్ అనే స్వచ్ఛంద సంస్థ వ్యాక్సిన్ పై వినూత్న అవగాహన కార్యక్రమం చేపట్టింది..…
కరోనాతో తల్లిదండ్రులు, సంరక్షలను కోల్పోయి అనాథలైన చిన్నారులను ఆదుకోవడానికి కీలక నిర్ణయం తీసుకున్నారు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్… కోవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు రూ.5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేయనున్నట్టు ప్రకటించారు.. 18 ఏళ్లు నిండిన తర్వాత ఈ మొత్తాన్ని వడ్డీతో సహా అందించే విధంగా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇక, ఆ చిన్నారులకు స్కూల్, కాలేజ్, గ్రాడ్యుయేషన్ వరకు విద్యా మరియు వసతి ఖర్చులను కూడా ప్రభుత్వమే భరిస్తుందన్న సీఎం స్టాలిన్.. అలాంటి అనాథ…
కరోనా సెకండ్ వేవ్ కొన్ని రాష్ట్రాల్లో తగ్గుముఖం పట్టినా.. మరికొన్ని రాష్ట్రాలను మాత్రం ఇంకా టెన్షన్ పెడుతూనే ఉంది.. దీంతో.. కరోనా కట్టడికి కోసం విధించిన లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ వస్తున్నాయి ఆయా రాష్ట్రాలు.. తాజాగా, తమిళనాడు కూడా లాక్‌డౌన్‌ను పొడిగించింది.. జూన్ 7 వరకు లాక్డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించింది తమిళనాడు సర్కార్.. ప్రస్తుత లాక్డౌన్ కు ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. నిత్యావసరాలకు సంబంధించిన దుకాణాలు ఉదయం 7 గంటల…
తమిళనాడులో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. రోజువారి కేసులతో పాటుగా మరణాల సంఖ్యకూడా పెరుగుతున్నాయి. దీంతో దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటి వరకు దేశం మొత్తంమీద 20.57 కోట్ల వ్యాక్సిన్ డోసులు వేయడం విశేషం. ఇక తమిళనాడులో వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసిన సంగతి తెలిసిందే. రోజుకు లక్షకు పైగా వ్యాక్సిన్ ను అందిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఉచితంగా టీకా వేస్తామని హామీ ఇచ్చింది డిఎంకే. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వం ఉచితంగా టీకాలు వేస్తున్నది.…
కరోనా సెకండ్ వేవ్ సమయంలో దేశవ్యాప్తంగా వేలాది మంది జర్నలిస్టులు మహమ్మారి బారినపడ్డారు.. ఇక, వందలాది మంది ప్రాణాలు వదిలారు.. అయితే, తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.. జర్నలిస్టుల కుటుంబాలకు అండగా ఉంటామని హామీ ఇచ్చిన సీఎం ఎంకే స్టాలిన్.. కరోనాతో ఎవరైనా గుర్తింపు పొందిన జర్నలిస్టు మరణిస్తే.. వారి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు.. అంతేకాదు.. కరోనా సమయంలో.. జర్నలిస్టులకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.2000 నుంచి రూ.5 వేలకు పెంచారు..…
దేశవ్యాప్తంగా కరోనా కేసుల తగ్గుముఖం పడుతున్న వేళ తమిళనాడులో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తమిళనాడులో 34,285 కొత్త కేసులు నమోదయ్యాయి. వైరస్‌కు మరో 468 మంది ప్రాణాలు కోల్పోయారు. గత 24 గంటల్లో అత్యధిక కేసులు తమిళనాడులోనే నమోదయ్యాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ స్ట్రెయిన్ తమిళ ప్రజలకు మరింత గుబులు పుట్టిస్తోంది. ఇక దేశంలో కరోనా కేసుల పాజిటివిటీ రేటు 11.53%కి తగ్గింది. రికవరీ రేటు 88.69%కి పెరిగింది.