తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చిలి శశికళ మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్ధం అవుతున్నారనే చర్చ సాగుతోంది.. ఇవాళ చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలో ఉన్న జయలలిత, ఎంజీఆర్ సమాధుల దగ్గర నివాళులర్పించిన శశికళ.. జయ స్మారకం వద్ద భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ఇక, అన్నా డీఎంకే జెండాను మాత్రం వదలడంలేదు శశికళ.. గతంలో ఆమె జైలు నుంచి విడుదలై.. తమిళనాడుకు వస్తున్న సమయంలోనూ జయలలిత ఫొటోలు, అన్నా డీఎంకే జెండాలతో ఆమెకు స్వాగతం లభించింది..…
తమిళనాడు రాజకీయాల్లో మళ్లీ చక్రం తిప్పేందుకు సిద్ధం అవుతున్నారు దివంగత సీఎం జయలలిత (అమ్మ) ఇష్టసఖి శశికళ (చిన్నమ్మ).. దానికి ముహూర్తం కూడా ఇప్పటికే ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.. అక్టోబర్ 17వ తేదీన అన్నాడీఎంకే ఆవిర్భావ దినోత్సవం జరగనుంది.. అదే రోజు పొలిటికల్ రీ ఎంట్రీకి శశికళ రంగం సిద్ధం చేసుకున్నట్టు పొలిటికల్ సర్కిల్లో చర్చ సాగుతోంది.. ఆ రోజు మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధిని సందర్శించేందుకు పోలీసు భద్రత కావాలని శశికళ అనుచరులు కోరారట.. దీంతో..…
డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు ఇవాళ మంత్రి కేటీఆర్ ను కలిశారు. తమిళనాడు సీఎం స్టాలిన్ రాసిన లేఖను ఈ సందర్భంగా కేటీఆర్ కు అందచేశారు డీఎంకే పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు. నీట్ ప్రవేశ పరీక్షను వ్యతిరేకిస్తూ 12 మంది సీఎం లకు లేఖ రాశారు స్టాలిన్. ఆ లేఖనే ఇవాళ మంత్రి కేటీఆర్ కు అందజేశారు. ఈ సందర్భంగా DMK ఎంపీ ఇలన్ గోవన్ మాట్లడుతూ.. నీటి పరీక్ష రద్దు అంశం పై…
తమిళనాడు కాంచీపురం జిల్లా శ్రీపెరంబుదూర్ ప్రాంతంలో చైన్ స్నాచర్ ఎన్ కౌంటర్ ను చేసారు పోలీసులు. అయితే తుపాకీతో కాల్పులు జరిపి స్థానికులను భయాందోళనలకు గురి చేసాడు చైన్ స్నాచర్. శ్రీపెరంబుదూర్‌లోని ఓ టోల్ ప్లాజా వద్ద ఓ 55 ఏళ్ల మహిళ గొలుసును దొంగిలించాడు ఝార్ఘండ్కు చెందిన ముర్తాసా. బాధితురాలి ఆరుపులతో స్థానికులు నిందితుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా కాల్పులకు తెగబడ్డాడు ముర్తాసా. అక్కడికి చేరుకున్న పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. వారిపై కూడా ముర్తాసా కాల్పులు…
బెంగళూరులో ఆదాయపు పన్ను అధికారులు విస్తృత సోదాలు చేపట్టారు. పన్ను ఎగవేత ఆరోపణలపై నగరంలోని 50కి పైగా ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి సోదాలు కొనసాగాయి. మొత్తం 300 మంది అధికారులు బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో ఇప్పటి వరకు 120కి పైగా కార్లను సీజ్ చేశారు. వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లు, ఛార్డెట్ అకౌంటెంట్ల నివాసాల్లో తనిఖీలు జరిగాయి. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యడియూరప్ప సన్నిహితుడు…
వైద్యవిద్య ప్రవేశాల కోసం నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్‌ను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మరోసారి వ్యతిరేకించారు. మద్దతు కోరుతూ 12 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాశారు. ముఖ్యంగా ఎన్డీఏయేతర పార్టీలు అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఝార్ఖండ్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రులకు ఎంకే స్టాలిన్ లేఖ రాశారు. నీట్‌ను వ్యతిరేకించడంతో పాటు విద్యారంగంలో రాష్ట్ర ప్రభుత్వాల ప్రాధాన్యతను తిరిగి పొందడానికి ఏకతాటిపైకి రావాల్సిన అవసరాన్ని…
పోలీసు డిపార్ట్మెంట్లో డీఎస్పీ అంటే మంచి ర్యాంకే.. ఆయనకు ఎక్కడికి వెళ్లినా తగిన గౌరవం, హోదా లభిస్తాయి.. అయితే, పోలీసులను చూసి ఓ డీఎస్పీ పరుగులు పెట్టారు.. అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోయే ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తిరుచ్చి విమానాశ్రయం సమీపంలో వాహనాలను తనిఖీ చేస్తున్న సమయంలో ఓ కారు నుంచి రూ.11 లక్షలతో ఓ డీఎస్పీ పరుగులు తీశాడు.. తిరుచ్చి పుదుక్కొట్టై ప్రధాన రోడ్డు అయిన ఎయిర్పోర్ట్ సమీపంలో వాహనాల తనిఖీ…
భారత్‌లో కరోనా కేసులు ప్రతీరోజు 40 వేలకు పైగానే నమోదు అవుతున్నాయి.. ఇక, ఈ కేసుల్లో అగ్రభాగం మాత్రం కేరళ రాష్ట్రానిదే.. సెకండ్ వేవ్ వెలుగుచూసినప్పట్టి నుంచి కేరళలో కోవిడ్ కంట్రోల్లోకి వచ్చింది లేదు.. అయితే, ఆ రాష్ట్రంలో కోవిడ్ ప్రారంభమైన తొలినాళ్లలో తీసుకొచ్చిన కరోనా ట్రేసింగ్ విధానాన్ని కొనసాగిస్తూ.. ఇప్పటికీ పెద్ద సంఖ్యలో టెస్ట్‌లు చేయడమే.. భారీ సంఖ్యలో కేసులు నమోదు కావడానికి కారణమని చెబుతున్నారు. మరోవైపు.. ఆ రాష్ట్రంలో కోవిడ్ ఉగ్రరూపం కొనసాగుతుండడంతో.. కేరళ…
మందు బాబులకు షాకింగ్ న్యూస్ చెప్పింది తమిళనాడు ప్రభుత్వం.. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.. ఇకపై ఆధార్ కార్డు, కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్టు సర్టిఫికెట్ ఉంటేనే మద్యం విక్రయించే విధంగా నిర్ణయం తీసుకున్నారు.. అయితే, ఇది ప్రస్తుతానికి నీలగిరి జిల్లాలో అమలు చేస్తున్నారు. మద్యం కొనుగోలు చేయాలంటే ఆధార్ కార్డు, కరోనా టీకా వేయించుకున్న సర్టిఫికెట్ చూపించాల్సిందేనని స్పష్టం చేశారు అధికారులు… కాగా, నీలగిరి జిల్లాలో 76 మద్యం దుకాణాలుండగా రోజూ రూ.కోటి…
ప్రతీకార రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ తమిళనాడు. గత నలబై ఏళ్ల నుంచి తమిళ నాట రివెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. కానీ కొత్త సీఎం దానికి ముగింపు పలికినట్టే కనిపిస్తోంది. పనికి రాని పనులు మాని రాష్ట్ర పురోగతిపై ఫోకస్ పెట్టారు సీఎం ఎం కే స్టాలిన్. ప్రస్తుతం ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా అది రాజకీయ సంచలనంగా మారుతోంది. అదే సమయంలో ఆయనపై దేశ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురిపిస్తోంది. రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారని…