తమిళనాడులో బ్రాహ్మణేతరులు పూజారులుగా మారబోతున్నారు. బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన అర్చకత్వాన్ని.. ఇకపై ఇతర సామాజిక వర్గాల వారు చేపట్టనున్నారు. ఈ మేరకు స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ వర్గాలకు చెందిన సుశిక్షితులైన 24మంది బ్రాహ్మణేతులను పలు పుణ్యక్షేత్రాల్లో అర్చకులుగా నియమించింది. ఇందులో ఐదుగరు షెడ్యూల్ కులాల వారు, ఆరుగురు ఎంబీసీలు, 12 మంది బీసీలు, ఓసీకి చెందిన ఒకరు ఉన్నా వీరితోపాటు మరో 138 మందిని ఆలయాల్లో పని చేయడానికి నియమించారు. వీరంతా ప్రభుత్వం తరఫున ఉద్యోగులుగా పనిచేయనున్నారు. అయితే దీనిపై దేశవ్యాప్తంగా పెద్దఎత్తున చర్చ జరుగుతోంది.