డాక్టర్.. దేవుడి తరువాత దేవుడిలా కొలిచే మనిషి. ఎవరికి చెప్పుకోలేని బాధలను సైతం డాక్టర్ల వద్ద చెప్పుకుంటాము. కానీ, ఇక్కడ మనం చెప్పుకోబోయే ఒక డాక్టర్ ఆ పవిత్ర వృత్తికే కళంకం తెచ్చాడు. పవిత్రమైన వృత్తిలో ఉంటూ పాడుపనులు చేయడం మొదలుపెట్టాడు. వైద్యం కోసం వచ్చిన మహిళలకు మాయమాటలు చెప్పి వారిని లొంగదీసుకోవడానికి ప్రయత్నించాడు. ఇటీవల హాస్పిటల్ కి వచ్చిన మహిళా డాక్టర్ దగ్గర కూడా తన నీచ బుద్దిని బయటపెట్టాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడంతో డాక్టర్ బాబు రాసలీలలు బయటపడ్డాయి.
వివరాలలోకి వెళితే.. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా, కోవిల్ పట్టికి సమీపంలోని ఇళయరాసానందల్ ప్రభుత్వ ప్రాధమిక వైద్యశాలలో కురుస్వామి అనే వ్యక్తి వైద్యుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. నిత్యం రోగులతో రద్దీగా ఉండే ఆ హాస్పిటల్ కి వచ్చే మహిళలపై కురుస్వామి కన్ను పడింది. తన వద్ద వైద్యం చేయించుకోవడానికి వచ్చిన మహిళా రోగుల ఫోన్ నెంబర్లను తీసుకోని మాట కలిపేవాడు.. వారికి అసభ్యకరమైన మెసేజ్ లు వీడియోలు పంపి రెచ్చగొట్టేవాడు.. వారు ఒప్పుకుంటే ఓకే .. లేకపోతే రాంగ్ మెసేజ్ అని తప్పించుకునేవాడు.
ఇలా చాలామంది మహిళలతో కురుస్వామి రాసలీలలు కొనసాగించాడు. అంతేకాకుండా హాస్పిటల్ లోనే మహిళలతో శృంగార కార్యకలాపాలు సాగిస్తూ రోగుల ముందే ఆ పాడుపనులను వీడియోలు తీసుకొని ఆనందించేవాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఆ హాస్పిటల్ కి వచ్చిన మహిళా వైద్యురాలిపై కూడా కురుస్వామి కన్ను పడింది. ఆమెతో మాటలు కలిపి, అసభ్యంగా మాట్లాడుతూ తాకడానికి ప్రయత్నించగా.. ఆమె వారించి, అతగాడి బాగోతాన్ని మొత్తం పోలీసులకు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు డాక్టర్ ని అరెస్ట్ చేయగా.. హాస్పిటల్ లోనే కాకుండా, తమను కూడా లైంగికంగా వేధించారని పలువురు మహిళలు తెలిపారు. ప్రస్తుతం కురుస్వామిని అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.