తమిళనాడు రాజకీయాలు ఎప్పుడు మిగిలిన రాష్ట్రాల కన్నా భిన్నంగా ఉంటాయి. ఇప్పటికే కొత్తగా గెలిచిన సీఎం స్టాలిన్ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూ పాలనలో దూసుకెళ్తున్నారు. నూతన సంస్కరణలతో తన మార్కు పాలనను తమిళనాడు ప్రజలకు చూపిస్తున్నారు. పరిపాలనా పరమైన నిర్ణయాల్లోను, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో స్టాలిన్‌కు ఎవ్వరూ సాటిలేరు.
తాజాగా తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. జూలై 18ని తమిళనాడు ప్రత్యేక రోజుగా ప్రకటిస్తున్నట్టు తెలిపారు. త్వరలో దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడ నున్నాయి. మాజీ సీఎం అన్నాదురై 1967 జూలై 18న అప్పటి మద్రాసు రాష్ట్రానికి తమిళనాడుగా పేరు మార్చారని కొందరు చెప్పారు. అన్నాదురై నిర్ణయం ప్రకారమే జూలై18ని తమిళనాడుకు ప్రత్యేక రోజుగా ప్రకటిస్తున్నట్టు సీఎం స్టాలిన్ పేర్కొన్నారు. ఈ డిమాండ్ ఎప్పటి నుంచో ఉందని స్టాలిన్ తెలిపారు.