తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చిలి శశికళ మళ్లీ రాజకీయాల్లో చక్రం తిప్పడానికి సిద్ధం అవుతున్నారనే చర్చ సాగుతోంది.. ఇవాళ చెన్నైలోని మెరీనా బీచ్ సమీపంలో ఉన్న జయలలిత, ఎంజీఆర్ సమాధుల దగ్గర నివాళులర్పించిన శశికళ.. జయ స్మారకం వద్ద భావోద్వేగంతో కంటతడి పెట్టారు. ఇక, అన్నా డీఎంకే జెండాను మాత్రం వదలడంలేదు శశికళ.. గతంలో ఆమె జైలు నుంచి విడుదలై.. తమిళనాడుకు వస్తున్న సమయంలోనూ జయలలిత ఫొటోలు, అన్నా డీఎంకే జెండాలతో ఆమెకు స్వాగతం లభించింది.. ఇక, రాష్ట్రవ్యాప్త పర్యటనకు సిద్ధం అవుతున్నారు..మళ్లీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తారనే చర్చ సాగుతోంది. అయితే, శశికలకు అన్నా డీఎంకేలో స్థానం లేదని స్పష్టం చేశారు పార్టీ సీనియర్, మాజీ మంత్రి జయకుమార్.. శశికళకు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చు.. ఆ స్థాయిలో ఆమె నటిస్తున్నారంటూ ఎద్దేవా చేసిన ఆయన.. అయినా శశికళను ప్రజలు.. పార్టీ కేడర్ నమ్మరని.. పార్టీ జెండా వాడుకునే అర్హత అమెకు లేదంటూ ఫైర్ అయ్యారు.