చిన్న పిల్లలకు పీచు మిఠాయి అంటే చాలా ఇష్టం. చూసేందుకు ఆకర్షణీయంగా, తియ్యగా ఉంటుంది. కేవలం చిన్న పిల్లలకే కాకుండా.. పెద్దవారికి కూడా పీచు మిఠాయి అంటే ఇష్టమే.. పీచు మిఠాయిని ఎక్కువగా బీచ్‌లు, పార్కులు, బస్టాండ్, రైల్వేస్టేషన్లలో విక్రయిస్తారు. అయితే ఒకప్పుడు మన ముందే పీచు మిఠాయిని తయారు చేసి ఒక చిన్నపాటి పుల్లకు చుట్టి ఇచ్చేవారు. కానీ.. ఇప్పుడున్న కాలంలో కవర్లలో పెట్టి అమ్ముతున్నారు.
Read Also: CPI Ramakrishna: బీజేపీతో జనసేన, టీడీపీ పొత్తు..! వారికే కాదు రాష్ట్రానికీ అరిష్టం..!
ఇటీవల కాలంలో ఉత్తరాది నుంచి వచ్చే యువకులే పీచు మిఠాయిని ఎక్కువగా విక్రయిస్తున్నారు. దీనిలో కొన్ని గంటల పాటు స్వచ్ఛతను కోల్పోకుండా ఉండే విధంగా రసాయనాలు కలుపుతున్నట్టు, వివిధ రంగుల్లో వీటిని తయారు చేయడానికి కొత్త రకం రసాయన పదార్థాలు వాడుతున్నట్టు పుదుచ్చేరిలో జరిగిన పరిశోధనలో తేలింది. ఈ రసాయనాలు క్యాన్సర్ కారకాలుగా గుర్తించారు. దీంతో ఈ పీచు మిఠాయిపై తమిళనాడులోనూ ఆందోళనలు మొదలయ్యాయి.
Read Also: Naa Saami Ranga : ఓటీటీలోకి వచ్చేసిన “నా సామి రంగ”.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
ఈ క్రమంలో.. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పీచు మిఠాయి విక్రయాలను నిషేధిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పీచు మిఠాయిలో క్యాన్సర్ కారక రసాయనాల వాడుతున్నారని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి ఎం. సుబ్రమణియన్ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా.. పీచు మిఠాయి విక్రయాలు జరిపితే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.