Tamil Nadu: తమిళనాడులో బీజేపీ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. మధురైలో బీజేపీ ఓబీసీ విభాగం నేత గురువారం ఉదయం గుర్తుతెలియని దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. హత్యకు గురైన వ్యక్తిని శక్తివేల్‌గా గుర్తించారు. బీజేపీ ఓబీసీ విభాగం జిల్లా కార్యదర్శిగా ఉన్న ఈయన గురువారం ఉదయం ఫైనాన్సింగ్ పనిలో నిమగ్రమై ఉండగా.. సాంగు నగర్‌లోని గోదాం వద్దకి వెళ్తున్న క్రమంలో దాడి జరిగింది.
Read Also: Sandeshkhali: టీఎంసీ నేతలే బీజేపీ లక్ష్యం.. సందేశ్‌ఖలీ అల్లర్లకు ఆర్ఎస్ఎస్ కారణమన్న మమతా బెనర్జీ..
శక్తివేల్ వల్లనాథపురంలోని తన ఇంటి నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఉదయం 6 గంటలకు ఈ దారుణం జరిగింది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం, దుండగుల బృందం అతనిని వెంబడించి, దారుణంగా దాడి చేసి హత్య చేశారు. దీనిపై అన్నానగర్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. బాధితుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, రాజాజీ ప్రభుత్వ ఆసుపత్రికి శవపరీక్ష కోసం పంపారు. అయితే, గూడ్స్ క్యారియర్ విక్రమానికి సంబంధించి శక్తివేల్‌కి ఇటీవల తలెత్తిన వివాదంతో ఈ హత్యకు ఏమైనా ప్రమేయం ఉందా..? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితులను గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు.