First Trangender Railway Ticket Inspector: దక్షిణ భారతదేశంలో తొలిసారిగా రైల్వే టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా తమిళనాడుకు చెందిన సింధు అనే ట్రాన్స్‌జెండర్ నియమితులయ్యారు. ట్రాన్స్‌జెండర్ సింధు నాగర్‌కోవిల్‌కు చెందిన వారు. ఈమె తమిళ సాహిత్యంలో బి.లిటరేచర్ చేశారు. ఇది తన జీవితంలో మరచిపోలేని జ్ఞాపకమని సింధు అన్నారు. హిజ్రా కావడంతో ఏమీ చేయలేమన్న నిరుత్సాహం నుంచి ఈ స్థాయికి చేరుకున్నందుకు చాలా గర్వంగా ఉందన్నారు. హిజ్రాలు తమ సమస్యలతో కుంగిపోకుండా.. విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలని సింధు సూచించారు.
కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో 19 ఏళ్ల క్రితం రైల్వేలో చేరిన ట్రాన్స్‌జెండర్ సింధు.. తమిళనాడులోని దిండిగల్‌కు బదిలీపై వచ్చారు. అక్కడే గత 14 ఏళ్లుగా పనిచేస్తున్నారు. అయితే ప్రమాదంలో గాయపడిన సింధును రైల్వేలోని వాణిజ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ విధులు నిర్వర్తిస్తూ టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా శిక్షణ పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో దిండుక్కల్ రైల్వే డివిజన్‌లో టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌గా నియమితులయ్యారు. గురువారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
Also Read: MS Dhoni: మాటలతో కాకుండా.. పనులతో గౌరవం పొందడం ముఖ్యం!
సింధు శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ‘సమాజంలో గౌరవప్రదమైన స్థానాలను సాధించడానికి ట్రాన్స్‌జెండర్లు కష్టపడి చదవాలి. విద్య మరియు కృషి ద్వారా ఉన్నత స్థాయిని సాధించవచ్చని నేను గట్టిగా నమ్ముతున్నా. నేను టిక్కెట్ ఇన్‌స్పెక్టర్‌ని అయినందుకు గర్వపడుతున్నా. అయితే ఈ స్థాయికి రావడానికి నేను చాలా కష్టపడ్డాను. హిజ్రాలు తమకున్న సమస్యలతో కుంగిపోకుండా విద్య, శ్రమతో ఉన్నత స్థాయికి చేరుకోవాలి’ అని సూచించారు.