Siddaramaiah: కావేరీ జలాలపై సిద్ధరామయ్య ఏమన్నారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బెంగళూరులో నీటి సంక్షోభం నెలకొన్న వేళ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నారంటూ బీజేపీ చేసిన ఆరోపణలను సీఎం సిద్ధరామయ్య కొట్టి పారేశారు. అవన్నీ అబద్ధాలేనని కొట్టిపారేశారు.
బెంగళూరు నగరంలో తీవ్ర నీటి ఎద్దడి నెలకొన్న వేళ కావేరీ జలాలను తమిళనాడుకు విడుదల చేస్తున్నట్లు ప్రతిపక్ష బీజేపీ చేస్తోన్న ఆరోపణలపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పందించారు. అవన్నీ అబద్ధాలేనంటూ కొట్టిపారేశారు.
Also Read
- CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
- Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
కర్ణాటకలో నీటికొరత ఎదుర్కొంటున్న ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క నీటిబొట్టును కూడా తమిళనాడుకు ఇచ్చేది లేదని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. చామరాజనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కావేరీ జలాలపై బీజేపీ ప్రచారమంతా అబద్ధమని కొట్టిపారేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు నీళ్లు ఇస్తారు? మన వినియోగానికి నీటిని ఉంచుకోకుండా తమిళనాడుకు చుక్క నీరు కూడా ఇవ్వమని చెప్పుకొచ్చారు. అయినా తమిళనాడు మమ్మల్ని అడగనప్పుడు మేం నీళ్లు ఎందుకు ఇస్తాం? వారికి ఇవ్వడానికి అసలు మన దగ్గర నీరు ఎక్కడ ఉన్నాయి? అని తెలిపారు. తమిళనాడు అడిగినా.. కేంద్రం లేదా ఇంకెవరైనా నీరు విడుదల చేయాలని కోరినా వాళ్లకు ఇచ్చే ప్రశ్నే లేదని సిద్ధరామయ్య తేల్చి చెప్పారు.
ప్రస్తుతం కర్ణాటక రాజధాని బెంగళూరులో భారీ నీటి సంక్షోభం నెలకొంది. వేసవి ప్రారంభంలోనే నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం పొరుగు రాష్ట్రమైన తమిళనాడుకు కావేరీ జలాలను విడుదల చేస్తోందంటూ కర్ణాటకలో ప్రతిపక్ష నేత ఆర్.అశోక సోమవారం ఆరోపణలు చేశారు. తక్షణమే నీటి విడుదలను ఆపాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన ఆరోపణలపై తాజాగా స్పందించిన సిద్ధరామయ్య.. అవన్నీ అవాస్తవాలేనని.. అసలు తమిళనాడుకు ఇచ్చేందుకు నీళ్లు ఎక్కడ ఉన్నాయని ముఖ్యమంత్రి ప్రశ్నించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: బుర్రిపాలెంలో కృష్ణ సినిమా హీరో.. పెమ్మసాని పొలిటికల్ హీరో!
-
Plague: ల్యాబ్ నుంచి మృత్యువు..! ఆ మహిళా ఎలా చనిపోయింది?
-
Shivraj Singh Chouhan: చంద్రబాబు నాయుడు డైనమిక్ లీడర్.. ఏపీ దేశంలోనే నంబర్ వన్ అవుతుంది!
-
Xiaomi Diwali Sale 2026: రూ.22,999 నుంచే Xiaomi ఫోన్లు.. 50% వరకు డిస్కౌంట్, Exchange + No-Cost EMI కూడా!
-
Varanasi Update: షాకవుతున్న ఫాన్స్.. ‘ఆర్ఆర్ఆర్’ రికార్డు బ్రేక్ చేసిన ‘వారణాసి’!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!