తమిళనాడులో షాకింగ్ కేసు వెలుగులోకి వచ్చింది. ధర్మపురి, మొరప్పూర్ సమీపంలోని ఒక గ్రామంలో మంగళవారం రాత్రి ఓ ప్రేమజంట పారిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా కలకలం రేగింది. ఈ క్రమంలో ఆగ్రహానికి గురైన యువతి కుటుంబ సభ్యులు యువకుడి తల్లిని తీసుకొచ్చారు. పారిపోయిన అమ్మాయి అగ్రవర్ణానికి చెందినది కాగా.. అబ్బాయి దళితుడని (ఎస్సీ) చెప్పారు. ఓ మీడియా కథనం ప్రకారం.. యువతి యువకుడితో పారిపోయిన విషయం తెలిసిన వెంటనే.. అమ్మాయి పేరెంట్స్ అబ్బాయి తల్లిని తమ వద్దకు తీసుకొచ్చారు. తన తల్లి వార్త విని యువకుడు ఎక్కడ ఉన్న ఇక్కడకు వస్తాడని బాలిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ప్రస్తుతం రెండు పోలీసు బృందాలు ప్రేమజంటను వెతికే పనిలో నిమగ్నమై ఉన్నాయి.
Assam: విద్యార్థుల నుంచి వ్యతిరేకత.. మెడికల్ కాలేజీ వివాదాస్పద అడ్వైజరీ రద్దు
ఓ వైపు పోలీసులు అబ్బాయి, అమ్మాయి కోసం వెతుకుతుండగా.. మరోవైపు అమ్మాయి బంధువులు కూడా వారి కోసం గాలిస్తున్నారు. 23 ఏళ్ల యువతి గౌండర్ (ఓబీసీ) వర్గానికి చెందినది. ఆమె 24 ఏళ్ల ప్రియుడు బెంగళూరులో చదువుకుని ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం రాత్రి వీరిద్దరూ ఇంట్లో నుంచి పారిపోయారు. ఈ క్రమంలో అమ్మాయి కనపడటం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఓ సీనియర్ పోలీస్ అధికారి మాట్లాడుతూ.. “అబ్బాయి, అమ్మాయి ఇద్దరూ బాగా చదువుకున్నారు. అబ్బాయి వ్యవసాయ శాస్త్రంలో గ్రాడ్యుయేట్ చేశాడు. కాగా.. అమ్మాయి కుటుంబీకులు యువకుడిపై అనుమానం వ్యక్తం చేశారు. కానీ వారు అతనిని ఫోన్‌లో సంప్రదించలేకపోయారు. ఈ క్రమంలో అమ్మాయి తల్లిదండ్రులు యువకుడిని తల్లి తీసుకొచ్చారు.”అని తెలిపారు.
Election commission: ఏపీలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ కోసం ఈసీ ప్రకటన
బుధవారం ఉదయం అమ్మాయి తల్లిదండ్రులు పక్క గ్రామంలో ఉన్న యువకుడి ఇంటికి వెళ్లారు. “కొడుకు పారిపోయాడని తెలుసుకున్న యువకుడి తల్లి కూడా షాక్‌కు గురైంది. కొడుక్కి ఫోన్ చేయడానికి ప్రయత్నించింది. కానీ.. అతని ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. అమ్మాయి తండ్రి అబ్బాయి తల్లిని తీసుకెళ్లాడు.” అని పోలీసులు చెబుతున్నారు. ప్రస్తుతం పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ముమ్మరం చేశారు.