Crime: తన ప్రియుడిని పెళ్లి చేసుకోవడానికి ఇంటిని వదిలేసి వచ్చిన 13 ఏళ్ల బాలికపై ఓ ట్రాఫిక్ పోలీస్ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో చెన్నైలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో 16 ఏళ్ల బాలుడు కూడా తనని పెళ్లి చేసుకుంటానని అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక చెప్పింది. బాలిక తల్లి మైలాపూర్ ఆల్ ఉమెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జనవరి 25 నుంచి తన కుమార్తె కనిపించడం లేదని చెప్పింది.
Read Also: UP Crime: మరదలిపై గ్యాంగ్ రేప్, హత్య కోసం రూ.40,000 అప్పు.. సంచలనంగా యూపీ కేసు..
ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలు తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి ఉన్నట్లు గుర్తించారు. జనవరి 25 తాను ఇంటి నుంచి పారిపోయినట్లు బాలిక విచారణలో వెల్లడించింది. ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న సమయంలో రామన్ అనే ట్రాఫిక్ పోలీస్ తనను ఇంటి వద్ద దించుతానని చెప్పి, వాహనంలో లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. ఆ తర్వాత పోలీస్ బూత్‌కి తీసుకెళ్లి, మరోసారి దాడికి పాల్పడ్డాడు. ఆమె కేకలు వేయడంతో అక్కడ నుంచి రామన్ పారిపోయాడు.
ఈ ఘటన తర్వాత బాలిక ఇంటికి తిరిగి వచ్చింది. తన తల్లి వేరొకరితో వివాహం చేస్తుందని అనుమానించి, రెండోసారి పారిపోయింది. బాలిక, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఇద్దరు అతడి బంధువు ఇంట్లో ఆశ్రయం పొందారు. బాయ్‌ఫ్రెండ్ పెళ్లి పేరుతో తనపై అత్యాచారం చేసినట్లు బాలిక పోలీసులకు చెప్పింది. పోలీసులు రామన్, అతని ప్రియుడు, అతని తల్లిపై పోక్సో చట్టం కింద అభియోగాలు మోపారు.