Byelections 2025: ఢిల్లీతో సహా మరో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉప ఎన్నికల పోలింగ్..
- ఢిల్లీ అసెంబ్లీతో పాటు మరో రెండు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉపఎన్నికల పోలింగ్..
- యూపీలోని మిల్కిపూర్, తమిళనాడులో ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ఓటింగ్..
- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని తెలిపిన ఎలక్షన్ కమిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Byelections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఉత్తర ప్రదేశ్, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో కూడా ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. యూపీలోని మిల్కిపూర్, తమిళనాడులోని ఈరోడ్ (ఈస్ట్) నియోజకవర్గాల్లో ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాలకు తరలి వస్తున్నారు. ఇక, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అవదేశ్ ప్రసాద్ రాజీనామాతో ఉత్తరప్రదేశ్ లోని మల్కిపురిలో బైపోల్ అనివార్యమైంది. ఎస్సీ రిజర్వ్‌డ్ స్థానమైన మిల్కిపూర్ నుంచి గత ఎన్నికల్లో అవదేశ్ ప్రసాద్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అయితే ఆ తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఫైజాబాద్ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగి గెలిచాడు. దీంతో ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో ఈ రోజు ఉప ఎన్నికకు పోలింగ్ జరుగుతుంది. ఈ నియోజకవర్గంలో 3,70,829 మంది ఓటర్లు ఉండగా.. 10 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటికీ.. అధికార బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ మధ్యే ప్రధాన పోటీ కొనసాగుతుంది.
Read Also: Mangalavaaram: ‘మంగళవారం’ మూవీ సీక్వెల్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!
Also Read
- Priyanka Gandhi: ‘మహిళలకు భద్రత లేకపోతే ఎన్ని పథకాలు పెడితే ఏం లాభం?’.. బీహార్, ఢిల్లీ ఘటనలపై ప్రియాంక గాంధీ ఆవేదన
- Minister Keerthana Health Controversy: మంత్రి కీర్తన లండన్ వెళ్లకపోవడంపై వివాదం.. అసలు కారణం ఇదేనా?
- Sahil Wakode Death: ‘‘నా కొడుకును బెదిరించారు’’.. ప్రొఫెసర్లపై సాహిల్ తండ్రి ఆరోపణ..
- CJP: మరో విద్యాశాఖ మంత్రి రాజీనామాకు సీజేపీ డిమాండ్..
అలాగే, కాంగ్రెస్ నేత ఈవీకేఎస్ ఇలాంగోళవన్ మరణించడంతో తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతుంది. డీఎంకే తరఫున వీసీ చంద్ర కుమార్ బరిలోకి దిగుతుండగా.. అన్నాడీఎంకే, బీజేపీలు ఆయనకు సవాల్ చేస్తున్నాయి. మొత్తం 46 మంది అభ్యర్థులు ఈ బైపోల్ బరిలో నిలిచారు. ఈ నియోజకవర్గంలో 2.28 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కుు వినియోగించుకోనున్నారు. అయితే, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఈ ఉప ఎన్నికల ఫలితాలు కూడా ఈ నెల 8వ తేదీన ఈసీ వెల్లడించనుంది.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!